ఈనెల 15న సూర్యపేటలో మంత్రి కేటీఆర్‌ పర్యటన..

104
ktr
- Advertisement -

ఈనెల 15న మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్‌, మంత్రి జగదీష్ రెడ్డిలు ఉమ్మడి నల్గొండ జిల్లాలో పర్యటించనున్నారు. ఇందులో భాగంగా మంత్రి కేటీఆర్‌ మొదట సూర్యపేటలో దేశం కోసం ప్రాణాలర్పించిన అమరుడు కల్నల్ సంతోష్ బాబు విగ్రహాన్ని కోర్ట్ చౌరస్తాలో ఆవిష్కరణ చేయనున్నారు. ఆ తర్వాత ఇంటిగ్రేటెడ్ మార్కెట్‌లో నూతన భావనాల నిర్మాణానికి భూమి పూజ చేస్తారు. అక్కడి నుంచి నల్గొండ జిల్లాలోని నకేరేకల్ నియోజకవర్గంలో భిమారం గ్రామంలో వైకుంఠదామం, రైతు వేదిక లను మంత్రి కేటీఆర్‌ ప్రారంభించనున్నారు.ఆ తర్వాత నకేరేకల్ మున్సిపాలిటీలో 100 పడకల ఆసుపత్రి, వార్డుల్లో వివిధ అభివృద్ధి పనులకు భూమి పూజ నిర్వహించనున్నారు.

ఈ మేరకు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. సూర్యపేట పట్టణంలో కల్నల్ సంతోష్ బాబు విగ్రహాన్ని ఏర్పాటు చేసిన కోర్ట్ చౌరస్తాను అందంగా ముస్తాబు చేశారు. ల్యాండ్ స్కీపింగ్ చేసి తీరొక్క పులా మొక్కలను నాటారు. 9.6 అడుగుల ఎత్తులో సంతోష్ బాబు కాంస్య విగ్రహాన్ని జేఎన్‌టీయూ ఫైన్ ఆర్ట్స్ ఆధ్వర్యంలో తయారు చేసి సిద్ధంగా ఉంచారు. మంగళవారం కోర్టు చౌరస్తాకు సంతోష్ బాబు చౌరస్తాగా నామకరణం చేసి ఆయన విగ్రహాన్ని అవిష్కరించనున్నారు మంత్రి కేటీఆర్‌. ఈ పర్యటన సందర్భంగా సూర్యపేట,నల్గొండ జిల్లాల కలెక్టర్లు, సూర్యపేటలో మంత్రి జగదీష్ రెడ్డి, నకేరేకల్‌లో ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య లు ఏర్పాట్లును దగ్గరుండి పూర్తి చేశారు.

- Advertisement -