తెలంగాణ రాష్ట్ర సాధకులు, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి, మన కేసీఆర్ పై ప్రభుత్వం చేపట్టిన అక్రమ విచారణను తీవ్రంగా నిరసిస్తూ రాష్ట్రవ్యాప్తంగా కదిలివచ్చిన ప్రతి ఒక్కరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు చెప్పారు మాజీ మంత్రి కేటీఆర్.
ఈ మేరకు ఎక్స్‌లో ట్వీట్ చేసిన కేటీఆర్..ప్రభుత్వ నిరంకుశ, ప్రజావ్యతిరేక వైఖరిని ఎండగడుతూ గ్రామం నుంచి గడప దాటి, మండలం నుంచి జిల్లా దాకా, చివరకు రాజధాని వరకు ఎక్కడికక్కడ ఉధృత స్థాయిలో నిరసనలు తెలిపిన పార్టీ నాయకులు, కార్యకర్తలు, ప్రజల అంకితభావం అపూర్వం అన్నారు.
తెలంగాణ కోసం ప్రాణాలు అర్పించిన ఉద్యమ చరిత్రను, రాష్ట్ర ఆత్మగౌరవాన్ని కించపరిచేలా జరుగుతున్న ఈ అక్రమ చర్యలకు వ్యతిరేకంగా ప్రజలు స్వచ్ఛందంగా రోడ్డెక్కడం ప్రజాస్వామ్యానికి గట్టి సంకేతం. కేసీఆర్ గారి నాయకత్వంలో తెలంగాణ సాధించిన అభివృద్ధిని, సంక్షేమాన్ని మరచిపోయి ప్రతీకార రాజకీయాలకు పాల్పడుతున్న ప్రభుత్వానికి ఈ నిరసనలు స్పష్టమైన హెచ్చరిక అన్నారు.
ఈ ఐక్యత, ఈ పోరాట స్పూర్తి తెలంగాణ భవిష్యత్తును కాపాడే శక్తి. తెలంగాణ ప్రజల ధైర్యం, చైతన్యం ఎప్పటికీ అజేయం అన్నారు.
Also ead:కేసీఆర్‌ను కలిసిన గూడెం మధుసూదన్
తెలంగాణ రాష్ట్ర సాధకులు, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి, మన కేసీఆర్ గారిపై ప్రభుత్వం చేపట్టిన అక్రమ విచారణను నిరసిస్తూ… రాష్ట్రవ్యాప్తంగా కదిలివచ్చి, ప్రభుత్వ వైఖరిని ఎండగడుతూ, రాజధాని వరకు ఎక్కడికక్కడ ఉధృత స్థాయిలో నిరసనలు తెలిపిన ప్రతి ఒక్క పార్టీ నాయకుడికి, కార్యకర్తకు, ప్రజలకి నా…
— KTR (@KTRBRS) February 1, 2026

