కేసీఆర్‌ను కలిసిన గూడెం మధుసూదన్

5
- Advertisement -

సిట్ విచారణ అనంతరం కాంగ్రెస్ ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి తమ్ముడు గూడెం మధుసూదన్ రెడ్డి హైదరాబాద్‌లోని నంది నగర్ నివాసంలో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా కేసీఆర్‌ను కలిసి ఆశీర్వాదం తీసుకున్నారు. ఈ భేటీ రాజకీయ వర్గాల్లో ప్రాధాన్యతను సంతరించుకుంది.

సమావేశం సందర్భంగా రాబోయే మున్సిపల్ ఎన్నికలపై కేసీఆర్ కీలక సూచనలు చేశారు. మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ ఘన విజయం సాధించాల్సిన అవసరం ఉందని, పార్టీ శ్రేణులు క్షేత్రస్థాయిలో మరింత చురుగ్గా పనిచేయాలని దిశా నిర్దేశం చేశారు. ప్రతి డివిజన్‌, ప్రతి వార్డులో ప్రజల మధ్య ఉండి ప్రభుత్వ వైఫల్యాలను ప్రజలకు వివరించాలని సూచించారు.

ప్రతి బీఆర్ఎస్ అభ్యర్థిని భారీ మెజారిటీతో గెలిపించేలా వ్యూహాత్మకంగా పని చేయాలని కేసీఆర్ కోరారు. ప్రజల సమస్యలను నేరుగా వినడం, సంక్షేమ పథకాలపై అవగాహన కల్పించడం ద్వారా పార్టీపై నమ్మకం పెంచాలని సూచించారు. ఈ భేటీ మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో బీఆర్ఎస్ శ్రేణుల్లో ఉత్సాహాన్ని నింపిందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.

Also Read:Budget 2026: బడ్జెట్ హైలైట్స్

- Advertisement -