రహదారులపై పేరుకుపోయిన బురదను వెంటనే తొలగించాలని..వ్యాధులు ప్రబలకుండా చర్యలు తీసుకోవాలన్నారు మంత్రి కేటీఆర్. రాష్ట్రంలో వర్షాలు తగ్గుముఖం పట్టిన నేపథ్యంలో సహాయక చర్యలపై కలెక్టర్లు, పురపాలక శాఖ ఉన్నతాధికారులతో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు కేటీఆర్.
నిండిన చెరువులను ఎప్పటికప్పుడు పరిశీలించాలని…అవసరమైతే లోతట్టు ప్రాంతాల్లో ఉన్న ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని ఆదేశాలు జారీ చేశారు. పారిశుద్ధ్యం, తాగునీటి సరఫరాపై జాగ్రత్తలు తీసుకోవాలని..ఎలాంటి సహాయసహకారాలు అందించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు.
Also Read:Harishrao:తెలంగాణ ఆత్మగౌరవం దెబ్బతీసే కుట్ర
ఇతర శాఖలతో మున్సిపల్ అధికారులు సమన్వయం చేసుకోవాలని సూచించారు కేటీఆర్. సహాయక చర్యలకు ప్రతి జిల్లాలో కంట్రోల్ సెంటర్లు ఏర్పాటు చేయాలని.. ప్రతి పట్టణంలో ప్రత్యేకంగా పారిశుద్ధ్య డ్రైవ్‌ని చేపట్టాలన్నారు. పెద్ద ఎత్తున మెడికల్ క్యాంపులు ఏర్పాటు చేయాలని.. శిథిలావస్థలో ఉన్న పురాతన భవనాలు తొలగించాలని ఆదేశాలు జారీ చేశారు.
Also Read:వర్షాకాలంలో ఫుడ్ పాయిజన్ తగ్గించే చిట్కాలు..