Pawan:’బ్రో’ తొలిరోజు వసూళ్లివే

25
- Advertisement -

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, సాయి ధరమ్ తేజ్ కాంబోలో వచ్చిన బ్రో నిన్న విడుదలై పాజిటివ్ టాక్‌ని సొంతం చేసుకుంది. తమిళ మూవీ వినోదయ సీతంకు రీమేక్‌గా వచ్చిన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద పాజిటివ్ టాక్‌ని సొంతం చేసుకుంది. మొదటి ఆట నుండే మంచి టాక్ రావడంతో వసూళ్లలోనూ సత్తాచాటింది.

బ్రో సినిమా మొదటి రోజు ప్రపంచవ్యాప్తంగా పవన్ కెరీర్ హైయెస్ట్ కలెక్షన్స్ సాధించింది. ప్రపంచవ్యాప్తంగా మొదటిరోజు ఏకంగా 48 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లు సాధించింది. ఇక తెలుగు రాష్ట్రాల్లోనే 35.24 కోట్లు వసూలు చేయగా ఓవర్సీస్ లో 9 కోట్లకు పైగా, కర్ణాటకలో 3 కోట్లకు పైగా, రెస్టాఫ్ ఇండియా దాదాపు కోటి రూపాయలు కలెక్ట్ చేసింది. ఇవాళ, రేపు వీకెండ్ కావడంతో వసూళ్లు మరింత పెరిగే అవకాశం ఉంది.

Also Read:సూపర్ స్టార్ కామెంట్స్ వైరల్

ఒక మంచి ఎమోషనల్ స్టోరీకి కమర్షియల్ ఎలిమెంట్స్ జోడించి, పవన్ ఫ్యాన్స్ కోసం స్పెషల్ ఎలిమెంట్స్ యాడ్ చేసి సినిమాని ఓ రేంజ్ కి తీసుకెళ్లారు. దీంతో థియేటర్స్ లో ప్రతి పది నిమిషాలకి గ్యాప్ లేకుండా ఫ్యాన్స్ అరుపులు, విజిల్స్ తో అదరగొట్టారు. ఇక సినిమా చివరి 15 నిముషాలు ప్రేక్షకులని ఏడిపించేశారు.

Also Read:డబుల్ ఇస్మార్ట్‌లో బిగ్ బుల్‌ సంజయ్‌

- Advertisement -