సిరిసిల్ల క్రికెటర్‌ అక్షరకు కేటీఆర్ అండ

2
- Advertisement -

రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలం మల్లారెడ్డిపేటకు చెందిన యువ క్రికెటర్ అక్షర అరుదైన మైలురాయిని చేరుకుంది. జమ్మూ కాశ్మీర్‌లో జరగనున్న ప్రతిష్టాత్మక జాతీయ స్థాయి మహిళల అండర్-19 క్రికెట్ టోర్నమెంట్‌కు ఆమె ఎంపికైంది. గ్రామీణ ప్రాంతం నుంచి వచ్చి జాతీయ స్థాయి టోర్నీకి ఎంపిక కావడంపై స్థానికులు, క్రీడాభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

అక్షర జాతీయ స్థాయి టోర్నమెంట్‌కు ఎంపికైన విషయం తెలుసుకున్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, స్థానిక శాసనసభ్యులు కె. తారకరామారావు (కేటీఆర్) ఆమెకు ప్రత్యేక శుభాకాంక్షలు తెలిపారు. అక్షర ప్రతిభను అభినందించిన కేటీఆర్, ఆమె భవిష్యత్ క్రీడా ప్రయాణానికి అవసరమైన పూర్తి సహాయ సహకారాలు అందిస్తానని హామీ ఇచ్చారు.

అక్షర క్రికెట్ శిక్షణకు, టోర్నమెంట్లకు వెళ్లడానికి అయ్యే ప్రయాణ ఖర్చులు మరియు ఇతర క్రీడా పరికరాల ఖర్చులను తానే భరిస్తానని కేటీఆర్ వెల్లడించారు.ఆర్థిక ఇబ్బందుల వల్ల ఏ ప్రతిభావంతురాలైన క్రీడాకారిణి ఆట ఆగకూడదు. నీకు ఎలాంటి సహాయం కావాలన్నా నేను వెన్నంటి ఉంటాను” అని అక్షరకు ఆయన భరోసానిచ్చారు.

గ్రామీణ ప్రాంత క్రీడాకారులను ప్రోత్సహించడంలో ఎప్పుడూ ముందుండే కేటీఆర్, అక్షర భవిష్యత్తులో భారత జాతీయ జట్టుకు ప్రాతినిధ్యం వహించి దేశానికి, తెలంగాణ రాష్ట్రానికి మంచి పేరు తేలాలని ఆకాంక్షించారు. నాయకుడి నుండి లభించిన ఈ అపూర్వమైన ప్రోత్సాహంతో అక్షర కుటుంబ సభ్యులు మరియు గ్రామస్తులు ఆనందం వ్యక్తం చేస్తూ కేటీఆర్‌కు ధన్యవాదాలు తెలిపారు.

Also Read:చైనాకు అమెరికా ఆయుధాలు!

- Advertisement -