ఈ-రేస్‌కు అద్భుత స్పందన

226
- Advertisement -

రయ్‌ రయ్ అంటూ పరుగులు తీసిన ఈ- రేసింగ్ కార్లు అభిమానులకు కన్నుల పండగగా కనువిందు చేశాయి. ఇండియన్ రేసింగ్ లీగ్‌ హైదరాబాద్‌ వేదికగా ప్రారంభమైన విషయం తెలిసిందే. ఈ రేస్‌ను మంత్రి కేటీఆర్‌ చేతులమీదుగా ఉదయం ప్రారంభం కాగా ఎంతోమంది ప్రేక్షకులను విశేషంగా అకట్టుకున్నాయి. ఈ రేస్‌లో పాల్గొనేందుకు పలు దేశాల నుంచి రేసర్లు వచ్చారు.

ఇండియన్‌ రేసింగ్‌ లీగ్‌కు ఎన్‌టీఆర్‌ మార్గ్‌, హుస్సేన్‌సాగర్‌ పరిసరాల్లో నిర్వహిస్తున్నారు. నెక్లస్‌రోడ్డులో ఏర్పాటు చేసిన 2.7కిలోమీటర్ల ప్రత్యేక ట్రాక్‌లో పోటీలు సాగుతున్నాయి. ఇవాళ జరిగిన రేసింగ్‌లో 12 కార్లు 6బృందాలు 50శాతం దేశంలోని రేసర్లు మరియు 50శాతం విదేశీ రేసర్లు సత్తా చాటుతున్నారు. ఇక ఈపోటీలను వీక్షించేందుకు 7500మంది ప్రేక్షకులు కోసం ట్రాక్‌ మధ్యలో 7గ్యాలరీలను ఏర్పాటు చేశారు. ఇక ఆదివారం కూడా ఈ పోటీలు జరగనున్నాయి.

శుక్రవారం మధ్యాహ్నం నుంచి ఎన్టీఆర్‌మార్గ్‌, హుస్సేన్‌ సాగర్‌ పరిసరాలు యువతతో సందడిగా కన్పించాయి. శనివారం మధ్యాహ్నం తొలి లీగ్‌లో భాగంగా ఎన్‌టీఆర్‌ గార్డెన్‌ చుట్టూ ఉన్న ట్రాక్‌ వెంట ఫార్ములా కార్లు పరుగులు తీశాయి. తొలిసారిగా నగరంలో జరుగుతుండడంతో రేస్‌ను చూసేందుకు ఎంతో మంది ఉత్సాహం చూపుతున్నారు. రూ.1250 నుంచి రూ. 6 వేల వరకు టికెట్ల ధరలు ఉన్నాయి. భారత్‌లో ఇదే తొలి స్ట్రీట్ సర్య్కూట్‌ కావడం..అది హైదరాబాద్‌ వేదిక కావడం విశేషం.

ఇవి కూడా చదవండి…

అధర్మపురి..ఓడిపోవడానికి రెడీనా!

కుమార్తెను పరిచయం చేసిన నియంత…

అందమైన కళ్ల కోసం..

- Advertisement -