మున్సిపాలిటీల్లో దోమల నివారణ కార్యక్రమం..

263
ktr
- Advertisement -

మున్సిపాలిటీల్లో రేపటి నుండి దోమల నివారణ కార్యక్రమం చేపట్టనున్నారు. ఈ కార్యక్రమంలో ప్రజా ప్రతినిధులు అందరిని కలుపుకొని ముందుకుపోవాలని మున్సిపల్ కమిషనర్లకు మంత్రి కేటీఆర్ ఆదేశాలు జారీ చేశారు. ప్రతి ఆదివారం- పది గంటలకు- పదినిమిషాలు పేరిట సీజనల్ వ్యాధుల నివారణ కార్యక్రమాన్ని రేపటి నుంచి ప్రారంభించనున్నారు.

ఈ కార్యక్రమంలో భాగంగా ప్రతి ఒక్కరూ తమ ఇళ్లలోనే ఉండి దోమల నివారణ కార్యక్రమాలు చేపట్టాలని సూచించారు. ప్రస్తుతం ఉన్న ప్రత్యేక పరిస్థితుల నేపథ్యంలో అన్ని పట్టణాల్లో ఆస్తిపన్ను పైన ఐదు శాతం ఎర్లీ బర్డ్ ప్రోత్సాహకం అందించనున్నారు.

ఇప్పటిదాకా వార్షిక ఆస్తిపన్ను కేవలం 30000 వరకే అంటూ ఉన్న పరిమితి ఎత్తేస్తూ పురపాలక శాఖ నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో  ఆస్తి పన్ను ఎంత ఉన్నా మే 31 లోపల పన్ను చెల్లిస్తే ఐదు శాతం ప్రోత్సాహకం అందించనున్నారు.

 రెసిడెన్షియల్, కమర్షియల్ క్యాటగిరిల వారికి ఈ ఎర్లీ బర్డ్ ప్రోత్సాహకం వర్తింపు చేయనున్నట్లు చెప్పారు. మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఇతర ప్రజాప్రతినిధులు అందరూ కూడా తమ తమ ఇళ్లలో ఈ కార్యక్రమంలో పాల్గొని, నిలువ నీరు లేకుండా చర్యలు తీసుకోవాలని, ఇతరులకు స్ఫూర్తిగా నిలవాలని మంత్రి కేటీఆర్ సందేశం ఇచ్చారు.

- Advertisement -