విధ్వంసం నుండి వికాసం వైపుకు:కేటీఆర్

35
- Advertisement -

కాంగ్రెస్ పాలనలో తెలంగాణ పూర్తిగా ధ్వంసమైందన్నారు మాజీ మంత్రి కేటీఆర్. తెలంగాణ భవన్‌లో తొమ్మిదిన్నరేళ్ల ప్రగతి ప్రస్థానంపై స్వేద పత్రాన్ని విడుదల చేసిన కేటీఆర్…చెమటోడ్చి,రక్తాన్ని రంగరించి అభివృద్ది దిశగా పనిచేశామన్నారు. విధ్వంసం నుండి వికాసం వైపుకు తెలంగాణ ప్రయాణం సాగిందన్నారు. ఏ రంగం తీసుకున్న సమైక్య పాలనలో విధ్వంసమే కనిపిస్తుందన్నారు.

కాంగ్రెస్ పాలనలో చెరువుల నిర్విర్యమయ్యాయన్నారు.తెలంగాణ ఇస్తే అంధకారమన్న నాయకులు ఇప్పుడు ఎక్కడ ఉన్నారో ఆలోచించాలన్నారు.ఉద్యమంలో ఏనాడూ లేని కాంగ్రెస్ నాయకులు ఇప్పుడు పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నారన్నారు.శ్వేత పత్రాల పేరుతో తెలంగాణ విఫలరాష్ట్రగా చూపుతున్నారన్నారు.

2014 కంటే ముందు తెలంగాణ అన్ని రంగాల్లో వివక్షకు గురైందన్నారు. రాష్ట్రం ఏర్పాడ్డాక విద్యుత్ కోతలు, నీటి కష్టాలు అనేక సమస్యలు ఉన్నాయన్నారు.వ్యవసాయ రంగాన్ని గట్టెక్కించాలనే ప్రయత్నంలో విజయం సాధించామన్నారు. సమైక్య పాలనలో బాధ పడని తెలంగాణ బిడ్డ లేడన్నారు.

Also Read:krithi shetty:ప్రేమ పై కృతి శెట్టి స్పందన

- Advertisement -