వ్యవసాయంలో ఆధునిక సాంకేతికత ఉపయోగించుకోవాలి. దేశంలోనే అతిపెద్ద టెక్నాలజీ ఇంక్యుబేటర్ తెలంగాణలో ఉందన్నారు రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కేటీఆర్. గురువారం నెక్లెస్ రోడ్లోని హెచ్ఎండీఏ మైదానంలో రాష్ట్ర సహాయ సాంకేతిక ఆవిష్కరణల ప్రదర్శన-2020ను మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ..సాంకేతిక పరిజ్ఞానం ఎంత వినియోగించుకుంటే అంత ముందుకెళ్తాం. సీఎం కేసీఆర్ ఎప్పుడూ టెక్నాలజీ ఉపయోగకరంగా ఉండాలని చెప్తుంటారు.
సాంకేతికత మానవాళికి ఉపయోగపడినప్పుడే దానికి సార్థకత. ప్రజలకు ఉపయోగపడితేనే టెక్నాలజీకి పరమార్థం. ప్రపంచ దివ్యాంగుల దినోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన ఈ ప్రదర్శన ప్రత్యేకమైనదని’ మంత్రి కేటీఆర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో ఐటీశాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్ రంజన్, మహిళా శిశు సంక్షేమశాఖ కమిషనర్ దివ్యా దేవరాజన్, దివ్యాంగులు, వయోవృద్ధుల సంక్షేమశాఖ డైరెక్టర్ శైలజ, టీఎస్ఐసీ సీఈవో, టీహబ్ సీఈవో రవి నారాయణ్ తదితరులు పాల్గొన్నారు.