రాష్ట్రానికి సంబంధించిన ప్రయోజనాలపై కేంద్రంపై పోరులో రాష్ట్ర ప్రభుత్వానికి తాము సహకరిస్తామని తెలిపారు కేటీఆర్. అసెంబ్లీలో మాట్లాడిన కేటీఆర్..ఝార్ఖండ్, ఉత్తరాఖండ్, ఛత్తీస్‌గఢ్ రెండున్నర దశాబ్దాల్లో ఇంకా బాలారిష్టాలు అధిగమించలేదని, ఇటీవలే సెక్రటేరియట్, అసెంబ్లీలు కట్టుకున్నారని తెలిపారు.కొట్లాడకపోతే కేంద్రం నిధులు కూడా ఇవ్వదు. పోరాడాల్సిందే. కేంద్రంతో గట్టిగా మాట్లాడేందుకు మేము కూడా మద్దతిస్తాం అన్నారు.
పార్లమెంటు ఎన్నికల్లో తమ పార్టీకి ఒక్క సీటు కూడా రాలేదని విమర్శించారని గుర్తు చేశారు. తమకు వచ్చిందే సున్నానే మరి కేంద్ర బడ్జెట్‌లో తెలంగాణకు వచ్చింది గుండు సున్నా కాదా అని నిలదీశారు. పసుపు బోర్డు ప్రకటించి ఆ బోర్డుకు నిధులు కేటాయించలేదని …కేంద్రంతో గట్టిగా మాట్లాడేందుకు తాము కూడా మద్దతిస్తామని అన్నారు.
తెలంగాణలోని ప్రముఖ ఆలయాలకు కేంద్రం ఒక్క రూపాయైనా ఇచ్చిందా? అని ప్రశ్నించారు. సమ్మక్క సారలమ్మ జాతరను జాతీయ పండుగగా గుర్తించాలని, కుంభమేళాకు కేంద్రం నిధులు ఇస్తుందని, సమ్మక సారలమ్మ జాతరకు ఎందుకు నిధులు ఇవ్వరని, మనం అడగకపోతే కేంద్రం నిధులు ఇవ్వదని అన్నారు. . పీఎం, సీఎం పచ్చి అబద్ధాలు చెప్తున్నారని, కేంద్రంతో సఖ్యత వల్ల రేవంత్‌రెడ్డి ఏం సాధించారని నిలదీశారు.
Also Read:వేసవిలో ఈ జాగ్రత్తలు తప్పనిసరి!