విద్యార్థులకు డిజిటల్ క్లాసులు అందించడంతో టీ శాట్ ఎంతగానో ఉపయోగపడిందని తెలిపారు మంత్రి కేటీఆర్. కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థల్లో మనవాళ్లు ఉద్యోగాలు పొందేలా టీ శాట్ శిక్షణ ఉండాలని తెలిపారు. హైదరాబాద్ అంబేద్కర్ వర్సిటీలో టీ శాట్ ద్వితీయ వార్షికోత్సవం సందర్భంగా హరితహారం కార్యక్రమంలో పాల్గొని మొక్కలు నాటారు.
భవిష్యత్‌లో టీ శాట్ ఇతర రంగాలకు విస్తరించాలన్నారు. టీశాట్ ప్రసారాల కోసం పోటీ పరీక్షలు రాస్తున్న విద్యార్థులు ఎదురుచూస్తున్నట్లు చెప్పారు. సామాన్యుడికి చేరువకాని సాంకేతిక పరిజ్ఞానం నిరుపయోగమని పేర్కొన్నారు. పోటీ పరీక్షలు వచ్చాయంటే టీశాట్ లో షెడ్యూల్ వివరాలను ప్రసారం చేస్తున్నారని తెలిపారు. టీశాట్ విద్య వరకే కాకుండా వ్యవసాయ రంగానికీ ఉపయోగపడాలని చెప్పారు.
టీ-శాట్ కార్యాలయంలో అన్నమయ్య పాటకు పట్టాభిషేకం చిత్రీకరణ జరుగుతుంది. చిత్రీకరణకు మంత్రి కేటీఆర్‌ను దర్శకుడు రాఘవేంద్రరావు సాదరంగా ఆహ్వానించారు.