ఆగస్టు 3న సుశాంత్…చిలసౌ

339
Chi La Sow
- Advertisement -

సుశాంత్,రుహాణి శర్మ జంటగా నటిస్తున్న చిత్రం ‘చిలసౌ’.. నటుడు రాహుల్ రవీంద్రన్ మొదటి సారి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకుని యూ/ఏ సర్టిఫికెట్ ని పొందింది.. ఈ సినిమా ద్వారా తెలుగు తెరకి రుహాణి శర్మ అనే కొత్త అమ్మాయి పరిచయం కాబోతుంది.

ప్రశాంత్ ఆర్ విహారీ సంగీతం అందిస్తున్న ఈ సినిమాలో వెన్నెల కిషోర్, రోహిణి మరియు అను హసన్ లు ఇతర ముఖ్య పాత్రల్లో నటించారు.. భారత్ కుమార్ మాలాసల, హరి పులిజల మరియు జస్వంత్ నదిపల్లి నిర్మిస్తున్న ఈ చిత్రం అన్నపూర్ణ స్టూడియోస్ సంస్థ ,సిరునీ సినీ కార్పొరేషన్ బ్యానర్ సంయుక్తంగా రిలీజ్ చేస్తున్నారు.. కాగా ఈ చిత్రాన్ని ఆగష్టు 3 న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ చేస్తున్నట్లు ఆఫీసియల్ గా ప్రకటించింది చిత్ర బృందం..

తారాగణం : సుశాంత్, రుహనీ శర్మ, వెన్నెల కిషోర్, రోహిణి, అను హసన్, రాహుల్ రామకృష్ణ, విద్యు రామన్ మరియు జయప్రకాష్,సాంకేతిక నిపుణులు :దర్శకుడు: రాహుల్ రవీంద్రన్,నిర్మాతలు:నాగార్జున అక్కినేని, భరత్ కుమార్ మలసాల , హరి పులిజాల మరియు జస్వంత్ నదిపల్లి,బ్యానర్లు: అన్నపూర్ణ స్టూడియోస్ మరియు సిరుని సినీ కార్పొరేషన్,సంగీతం: ప్రశాంతి ఆర్ విహార్,సినిమాటోగ్రఫీ: M. సుకుమార్,ఎడిటర్: చోటా కె ప్రసాద్,ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ : హరీష్ కోయలగుండ్ల,ఆర్ట్ డైరెక్టర్: వినోద్ వర్మ,చీఫ్ కో-డైరెక్టర్: డి. సాయి కృష్ణ,ప్రొడక్షన్ కంట్రోలర్: రవి కుమార్ యండమూరి,ప్రొడక్షన్ మేనేజర్: వాసిరెడ్డి సాయి,PRO: వంశీ శేఖర్

- Advertisement -