కేటీఆర్ @ స్పిరిట్ ఆఫ్ హైదరాబాద్

211
ktr
- Advertisement -

ఆర్థిక వృద్ధి రేటులో తెలంగాణ నెంబర్‌ వన్ స్థానంలో నిలిచిందని మంత్రి కేటీఆర్ తెలిపారు. ప్రపంచంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న రాష్ట్రాల్లో తెలంగాణ ఒకటన్నారు. మాదాపూర్ హోటల్ ఆవాసలో స్పిరిట్ ఆఫ్ హైదరాబాద్ కార్యక్రమంలో మాట్లాడిన కేటీఆర్ హైదరాబాద్ అన్ని రకాలుగా అనుకూలమైన ప్రాంతమన్నారు. కాలుష్యం తగ్గించేందుకు చర్యలు తీసుకున్నామని చెప్పారు. హైదరాబాద్ మౌలిక వసతులు కల్పించేందుకు కృషిచేశామన్నారు. మైక్రోసాఫ్ట్ లాంటి సంస్థలు హైదరాబాద్‌లో కార్యకలాపాలు నడుపుతున్నాయని చెప్పారు. శంషాబాద్ వరకు మెట్రోని పొడిగిస్తామన్నారు.

క్వాలిటీ ఆఫ్ లీవింగ్‌లో హైదరాబాద్ ది బెస్ట్ అన్నారు.రాష్ట్ర ఆదాయంలో 43 శాతం సంక్షేమం కోసం వినియోగిస్తున్నామని చెప్పారు.టీఆర్ఎస్ ప్రభుత్వ విధానాలతో హైదరాబాద్ గ్లోబల్ సిటీగా మారిందన్నారు. ఏడాదిలో హైదరాబాద్ మెట్రోలో మూడుకోట్ల మందికి పైగా ప్రయాణించారని తెలిపారు. దేశ జీడీపీలో అధిక శాతం మెట్రో నగరాలదే అన్నారు.

జిల్లాల్లోనూ ఐటీ కారిడార్స్‌ను విస్తరించి ఉపాధి అవకాశాలు కల్పిస్తామన్నారు. దేశంలోనే హైదరాబాద్‌కు ప్రత్యేక పరిస్థితులు ఉన్నాయని చెప్పారు. నీళ్లు,నిధులు,నియామకాలపై దృష్టి సారించామని చెప్పారు. మిషన్ కాకతీయ ద్వారా గ్రౌండ్ లెవల్ వాటర్ పెంచామన్నారు. మిషన్ కాకతీయ కోసం రూ. 20 వేల కోట్లు వెచ్చించామని చెప్పారు. 46 వేల చెరువులను పునరుద్దరించుకున్నామని తెలిపారు.

కాళేశ్వరం ప్రాజెక్టు పూర్తైతే 38 లక్షల ఎకరాలకు సాగు నీరు అందుతుందన్నారు. వచ్చే సంవత్సరం జూన్ నాటికి కాళేశ్వరం నీళ్లు తెలంగాణకు రానున్నాయని చెప్పారు. కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ చెప్పినట్లుగా కాళేశ్వరం ప్రాజెక్టులో ఎలాంటి అవినీతి జరగలేదన్నారు. ఆయన మాటలు ఒక్కటి కూడా నిజం కాదన్నారు. రైతు బంధుతో రైతుల జీవితాల్లో వెలుగులు నింపామని చెప్పారు. రైతు ప్రమాదవశాత్తు చనిపోతే రైతు భీమా ద్వారా 10 రోజుల్లో 5 లక్షల రూపాయలను అందిస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో పలు కంపెనీల ఐటీ కంపెనీల హెడ్స్,సీఈవోలు,ఐటో ఉద్యోగులు హాజరయ్యారు.

 

- Advertisement -