నేతన్నలకు భరోసా…చేనేత మిత్ర

216
ktr
- Advertisement -

నేతన్నలకు లాభం చేకూర్చేలా చేనేత మిత్ర పథకాన్ని తీసుకొచ్చిన ఘనత సీఎం కేసీఆర్‌దే అన్నారు మంత్రి కేటీఆర్. జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా పీపుల్స్ ప్లాజాలో ఏర్పాటుచేసిన కార్యక్రమంలో మాట్లాడిన కేటీఆర్ తెలంగాణ ప్రభుత్వం నేతన్నలకు అండగా ఎన్నో కార్యక్రమాలను తీసుకొచ్చిందని తెలిపారు. మనిషికి నాగరికత నేర్పిందే నేతన్ననే అని తెలిపారు. బడ్జెట్‌లో దేశంలో ఏ రాష్ట్రం కేటాయించని విధంగా తెలంగాణ ప్రభుత్వం చేనేత,జౌళి శాఖకు డబ్బులు ఇచ్చిందన్నారు.

ప్రణాళిక బద్ధమైన వ్యూహంతో ముందుకు వెళుతున్నామని చెప్పారు. రాష్ట్రంలో 42 వేల మంది చేనేత వృత్తిపై ఆధారపడి ఉన్నారని చెప్పారు. చేనేత మగ్గాల లెక్కలు తెల్చేందుకు జియో ట్యాగింగ్ చేశామన్నారు. రూ. 400 కోట్లకు పైగా బడ్జెట్‌లో కేటాయించామని చెప్పారు. చేనేత కార్మికులకు ఇస్తున్న ప్రోత్సాహం నేరుగా వారి అకౌంట్‌లోనే జమ చేస్తామని చెప్పారు.

ఇతర రాష్ట్ర ప్రభుత్వాలు నేతన్నల కోసం తెలంగాణ ప్రభుత్వం తెచ్చిన పథకాలను మెచ్చుకుంటున్నారని చెప్పారు.చేనేత మిత్ర పథకంలో ఎవరైనా చేరొచ్చని చెప్పారు.నేతన్నలకు రూ. లక్ష వరకు రుణం మాఫీ చేస్తామని కేటీఆర్ ప్రకటించారు.

అంతకముందు ట్విట్టర్‌లో జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా శుభాకాంక్షలు తెలిపారు కేటీఆర్. నాలుగేళ్ల నుంచి రాష్ట్రంలోని చేనేత కళాకారులకు ఆర్థిక సాయం అందిస్తూనే ఉన్నామని తెలిపారు. పోచంపల్లి, దుబ్బాక, గద్వాల్, కొత్తకోట, కరీంనగర్‌లోని చేనేత కార్మికులకు అన్ని విధాలా అండగా ఉంటున్నామని….చేనేత కళాకారుల్లో విశ్వాసం నింపామన్నారు.

- Advertisement -