మెదక్‌లో ఎగిరేది గులాబీ జెండానే అన్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. మెదక్ పార్లమెంటరీ నియోజకవర్గ స్థాయి సమావేశంలో మాట్లాడిన కేటీఆర్.. గవర్నర్ ప్రసంగంలో తెలంగాణ గుళ్ళ అయ్యిందని, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు విఫలం అయ్యిందని అబద్ధాలు మాట్లాడించారు. అందుకే స్వేద పత్రం విడుదల చేశాం. తెలంగాణ సమగ్ర అభివృద్ధిని పొందుపరిచాం. గణాంకాలు, ఆధారాలతో సహా వివరించాం అన్నారు.కాంగ్రెస్ ఇచ్చింది ఆరు గ్యారెంటీలు కాదు. మొత్తం లెక్క తెస్తే 420 హామీలు ఇచ్చారన్నారు.
దీన్ని ఎండగట్టే బాధ్యత మనందరి మీద ఉందన్నారు. రేవంత్ రెడ్డి పీసీసీ చీఫ్ గా ఉండి, అధికారంలోకి వచ్చాక డిసెంబర్ 9 నాడు రుణమాఫీ చేస్తా, 2 లక్షల రుణం తెచ్చుకోండి అన్నారు. తుమ్మల నాగేశ్వర రావు గారు రుణాలు వసూలు చేయాలి అని ఆదేశాలు జారీ చేశారు. లేకుంటే కేసులు పెట్టండి అని అంటున్నాడు. పత్రికల్లో కూడా వచ్చిందని,ప్రియాంక గాంధీ నిరుద్యోగ భృతి ఇస్తామని చెబితే, భట్టి గారు భృతి ఇస్తామని చెప్పలేదని హరీష్ రావు గారు అడిగిన ప్రశ్నకు అసెంబ్లీ సాక్షిగా అబద్దం చెప్పారన్నారు.
పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకు జాతీయ హోదా తెస్తామని హామీ ఇచ్చారు. కానీ అది సాధ్యం కాదని మొన్న స్పష్టమైందని,నోటికి ఎంత వస్తే అంత అనుకుంటూ హామీలు ఇచ్చారు. అందుకే 420 హామీలను చేసేదాకా విడిచి పెట్టం అన్నారు. ప్రధాని, అదానీ ఒక్కటని విమర్శలు చేసిన రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డి నేడు ఆయనతోనే ఒప్పందాలు కుదుర్చుకున్నారని..రాహుల్ గాంధీ నిన్ననే అదానీని తిడితే, రేవంత్ రెడ్డి అదే సమయంలో దావోస్ లో ఒప్పందం చేసుకున్నారన్నారు. నోటికి వచ్చినట్లు మాట్లాడిన కాంగ్రెస్, బీజేపీ నాయకుల అసలు రంగు బయట పడుతుందని,కేసీఆర్ ఉన్నంత కాలం అదానీ ఇక్కడ అడుగు పెట్టలేదు. కానీ కాంగ్రెస్ రాగానే ఎలా అడుగు పెడుతున్నాడన్నారు.
కేసీఆర్ , హరీశ్ రావు నాయకత్వంలో క్రియాశీలకంగా పని చేయడంతో గత ఎంపీ ఎన్నికల్లో అత్యధిక మెజార్టీ సాధించాం అని,ఈసారి కూడా మెదక్ లో గులాబీ జెండా ఎగరబోతున్నది. ఇందులో ఎలాంటి సందేహం లేదన్నారు.గత పదేళ్ళలో తెలంగాణ తరుపున గళం విప్పింది మన బీఆర్ఎస్ ఎంపీలు అనే విషయం మరచి పోవద్దని…రాష్ట్ర ప్రయోజనాలు కాపాడేది బీఆర్ఎస్ మాత్రమే. మన బలం, మన గళం, మన గులాబీ జెండా పార్లమెంట్ లో ఉండాలి. లేకుంటే తెలంగాణ ప్రయోజనాలకు నష్టం జరుగుతుందని, ఇదే విషయం ప్రజలకు చెప్పాలి. నిరాశ వీడాలి. బయటికి రావాలన్నారు.
Also Read:‘దీపికా పడుకోణె’తో ఐటెమ్ సాంగ్?