KTR:అన్నిరంగాల్లో అగ్రగ్రామిగా తెలంగాణ

24
- Advertisement -

తెలంగాణ దేశంలోనే అన్ని రంగాల్లో అగ్రగ్రామిగా ఉందన్నారు మంత్రి కేటీఆర్. చేపల ఉత్పత్తిలోనూ తెలంగాణ అగ్రస్థానంలో ఉందని…దేశంలో అతిపెద్ద ఆక్వా హబ్‌ సిద్ధమవుతుందని తెలిపారు. హైదరాబాద్‌ బేగంపేటలోని ఐటీసీ కాకతీయ హోటల్‌లో మంత్రి కేటీఆర్‌ సమక్షంలో లూలూ గ్రూప్‌ రాష్ట్రంలో కార్యకలాపాలు ప్రారంభించింది.

ఈ సందర్భంగా మాట్లాడిన కేటీఆర్..రాష్ట్రం ఏర్పడిన తర్వాత తలసరి ఆదాయం రెట్టింపయిందన్నారు. రాష్ట్రంలో 3.5 కోట్ల మెట్రిక్‌ టన్నుల ధాన్యం ఉత్పత్తి అవుతున్నదని చెప్పారు. వరిసాగులో దేశంలోనే తెలంగాణ అగ్రస్థానంలో ఉందని చెప్పారు. రాష్ట్రంలో లూలూ సంస్థ పెట్టుబడులతో టూరిజం పెరుగుతుందని భావిస్తున్నామన్నారు. తెలంగాణలో పండే పత్తి దేశంలోనే అత్యున్నతమైనదని చెప్పారు.

Also Read:వర్షాకాలంలో వచ్చే అలెర్జీలకు వీటితో చెక్.. !

కాళేశ్వరంతో తెలంగాణ సస్యశ్యామలం అయిందన్నారు. ఐదేండ్లలో 20 లక్షల ఎకరాల్లో ఆయిల్‌ పామ్‌ సాగు లక్ష్యంగా పెట్టుకున్నామని చెప్పారు. 10 వేల ఎకరాల్లో ఫుడ్‌ ప్రాసెసింగ్‌ జోన్లు ఏర్పాటు చేస్తున్నామని వెల్లడించారు.

- Advertisement -