కరీంనగర్‌ అభివృద్ధికి సహకరించండి..ప్రవాసులకు కేటీఆర్ పిలుపు

243
ktr
- Advertisement -

పరిశ్రమల ఏర్పాటుకు ఇతర దేశాల్లో స్థిరపడ్డ కరీంనగర్‌ వాసులు సహకరించాలని విజ్ఞప్తి చేశారు మంత్రి కేటీఆర్‌. హైదరాబాద్‌కు పరిమితమైన ఐటీ ఇప్పుడు కరీంనగర్‌ జిల్లాకు విస్తరించిందని…. కరీంనగర్‌లో నైపుణ్య శిక్షణా కేంద్రం ఏర్పాటు చేస్తున్నామని మంత్రి తెలిపారు. కరీంనగర్ పర్యటన సందర్భంగా కరీంనగర్ కార్పొరేషన్‌లో రోజు శుద్దమైన నీటి సరఫరా కోసం శాతవాహన వర్సిటీలో రూ. 100 కోట్లతో ఏర్పాటుచేసిన మెయిన్ బ్యాలెన్సింగ్ రిజర్వాయర్‌ను ప్రారంభించారు.

ఈ సందర్భంగా మాట్లాడిన కేటీఆర్….. 30 ఏళ్ల భవిష్యత్‌ను దృష్టిలో పెట్టుకుని బ్యాలెన్సింగ్‌ రిజర్వాయర్‌ నిర్మాణం చేపట్టినట్లు కేటీఆర్‌ స్పష్టం చేశారు. రాష్ట్రమంత ఈ పథకం ఆదర్శం కావాలని మంత్రి ఆశాభావం వ్యక్తం చేశారు. టీ హబ్‌ ప్రాంతీయ కేంద్రం కరీంనగర్‌ జిల్లాలో ఏర్పాటు కాబోతోందన్నారు.సీఎం కేసీఆర్‌ నాయకత్వంలో దీర్ఘకాలిక ప్రణాళికలతో కీలక రంగాలపై దృష్టి పెట్టామని తెలిపారు. ఒక్కో పని దిగ్విజయంగా పూర్తి చేసుకుంటూ ముందుకెళ్తున్నామని ఆయన చెప్పారు.

కరీంనగర్‌ జనసాంద్రత ప్రకారం.. అర్బన్‌ లంగ్స్‌ ఏర్పాటు చేస్తామని మంత్రి తెలిపారు. రాబోయే నెల రోజుల్లో కేబుల్‌ బ్రిడ్జి పూర్తి చేసి సీఎం కేసీఆర్‌ చేతుల మీదుగా ప్రారంభిస్తామన్నారు. కరీంనగర్‌కు కొత్త అందాన్ని తెచ్చే అలుగునూరు చౌరస్తాను సుందరమైన జంక్షన్‌గా మార్చేందుకు చర్యలు తీసుకుంటామని చెప్పారు.కరీంనగర్‌ పట్టణంలో ప్రతి రోజు మంచి నీరు అందించే కార్యక్రమంలో పాల్గొనడం సంతోషంగా ఉందని కేటీఆర్‌ తెలిపారు. కరీంనగర్‌లో ఏ కార్యక్రమం చేపట్టిన విజయవంతం అవుతుంది. ఏ పని ప్రారంభించినా కరీంనగర్‌లో నాంది పలకడం సంప్రదాయంగా మారిందన్నారు.

- Advertisement -