మూడోసారి తెలంగాణలో ఏర్పాటయ్యేది బీఆర్ఎస్ సర్కారే అన్నారు మంత్రి కేటీఆర్. కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గంలో ఏర్పాటుచేసిన బహిరంగసభలో మాట్లాడిన కేటీఆర్..రెండు రోజుల క్రితం తెలుగు సినిమా ఆర్ఆర్ఆర్ చిత్రంలోని నాటు నాటు పాటకు ఆస్కార్ అవార్డు వచ్చింది. ఈ దేశంలో అద్భుతమైన మహానటుడు ఉన్నాడు. అతన్నిపంపితే ఆస్కార్ తప్పకుండా వచ్చేదని పరోక్షంగా మోడీపై విమర్శలు గుప్పించారు.
2014లో ఎన్నో మాయమాటలు చెప్పి అధికారంలోకి వచ్చిండు. దేశం మొత్తం సంపద దోచి వాళ్ల దోస్తు ఖాతాలో వేస్తున్నాడని ఎద్దేవా చేశారు. వారి దగ్గర చందా తీసుకోని ప్రతిపక్ష పార్టీల మీద పడుతున్నాడు. పార్టీలను చీల్చి, ఎమ్మెల్యేలను కొని, దేశాన్ని ఆగం చేయాలని చూస్తున్నాడని దుయ్యబట్టారు. ఆయనను మహానటుడు అని ఉట్టిగానే అనలేదు. ఇలా నాటకాలు ఆడుతున్నందుకే మహానటుడు అని అన్నాను. రైతుల ఆదాయం డబుల్ చేస్తాను అన్నాడు. కానీ రైతుల ఆదాయం రెట్టింపు కాలేదు. సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తా అని అన్నాడు. ఒక్క ఉద్యోగం కూడా ఇవ్వలేదు. నల్లధనం తెస్తానని చెప్పిండు. దాన్ని గురించి అడిగితే తెల్ల ముఖమేస్తున్నాడు అని మండిపడ్డారు.
రాష్ట్రానికి పట్టిన శని బీజేపీ అని మోడీకి,ఈడీకి భయపడేదిలేదని ప్రజాకోర్టులోనే తేల్చుకుంటామని స్పష్టం చేశారు. ఎన్నికలు రాగానే బీజేపీ, కాంగ్రెస్ నాయకులు వస్తారు. వారికి కర్రుకాల్చి వాత పెట్టాలన్నారు.
ఇవి కూడా చదవండి..