ఎలక్ట్రిక్‌ హబ్‌గా తెలంగాణ: మంత్రి కేటీఆర్

296
ktr minister
- Advertisement -

ఎలక్ట్రానిక్‌, ఎలక్ట్రికల్‌ రంగాల్లోనూ రాష్ట్రాన్ని ఉన్నత స్థానంలో నిలబెడతామని చెప్పారు మంత్రి కేటీఆర్. తెలంగాణ రాష్ట్రం ఎలక్ట్రిక్‌ హబ్‌గా మారుతున్నదని …అమెరికా అధ్యక్షుడి హెలికాప్టర్‌ క్యాబిన్‌ కూడా హైదరాబాద్‌లోనే తయారైందని ప్రకటించారు.నగరంలోని హెచ్‌ఐసీసీలో జరిగిన ‘బ్రాండ్‌ హైదరాబాద్‌ ఫ్యూచర్‌ రెడీ’ సదస్సులో మంత్రి పాల్గొన్నారు.

రాబోయే రెండు దశాబ్దాల్లో ఎలక్ట్రానిక్‌, ఎలక్ట్రిక్‌ వాహనాల విభాగంలో మంచి భవిష్యత్‌ ఉందని చెప్పారు. ఏరో స్పేస్‌ రంగంలో తెలంగాణకు ఉజ్వల భవిష్యత్‌ ఉందన్నారు. ఒక్క రోజులో, ఒక్క ప్రభుత్వంతో హైదరాబాద్‌కు బ్రాండ్‌ ఇమేజ్‌ రాలేదన్నారు. హైదరాబాద్‌ బ్రాండ్‌ ఇమేజ్‌ను కాపాడుతూ అభివృద్ధిని కొనసాగిస్తున్నామని చెప్పారు.

ఎంతో కృషిచేస్తేనే హైదరాబాద్‌కు అమెజాన్‌ వచ్చిందన్నారు మంత్రి కేటీఆర్. అమెజాన్‌ మొదట బెంగళూరును ఎంపికచేసుకుందని, అయితే తెలంగాణ ప్రభుత్వ పన్ను విధానాలు నచ్చి అమెజాన్‌ హైదరాబాద్‌కు వచ్చిందని తెలిపారు. ఇప్పుడు అమెజాన్‌ అతిపెద్ద కార్యాలయం హైదరాబాద్‌లోనే ఉందన్నారు.

ఫుడ్‌ ప్రాసెసింగ్‌ రంగంలోనూ తెలంగాణ ముందువరుసలో ఉందని చెప్పారు. జిల్లాల్లో ప్రత్యేక ఫుడ్‌ ప్రాసెసింగ్‌ జోన్లు ఏర్పాటు చేస్తున్నామన్నారు. కరోనా తర్వాత ఆరోగ్యంపై అందరిలోనూ అవగాహన పెరిగిందని వెల్లడించారు. హైదరాబాద్‌లో ప్రస్తుతం ఉన్న మౌలిక సౌకర్యాలు సరిపోవని, అందువల్ల వసతులను పెంచాల్సిన అవసరం ఉందని చెప్పారు.

- Advertisement -