విశ్వనగరంగా హైదరాబాద్: కేటీఆర్

111
ktr

తెలంగాణ శాస‌న‌స‌భ ప్రత్యేకంగా సమావేశమైంది. జీహెచ్‌ఎంసీ సహా నాలుగు చట్టాల సవరణ కోసం బిల్లుల‌ను స‌భ‌లో ఆయా శాఖ‌ల మంత్రులు ప్ర‌వేశ‌పెట్టారు. జీహెచ్ఎంసీ సవరణ బిల్లు – 2020 సందర్భంగా మాట్లాడిన మంత్రి కేటీఆర్ గత పాలకులు హైదరాబాద్‌ను విశ్వనగరంగా మార్చాలని ప్రయత్నించలేదన్నారు. కొత్త చ‌ట్టం తీసుకురావాల‌నే ఆలోచ‌న వారికి లేదు. ఇవాళ టీఆర్ఎస్ ప్ర‌భుత్వం ముఖ్య‌మైన ఐదు సవ‌ర‌ణ‌లు చేసుకుంటున్నామ‌ని కేటీఆర్ తెలిపారు.

హైద‌రాబాద్ న‌గ‌రానికి ఎంతో గొప్ప చ‌రిత్ర ఉంద‌ని, సీఎం కేసీఆర్ నేతృత్వంలో ఇవాళ ఒక మ‌హాన‌గ‌రంగా, విశ్వ‌న‌గ‌రంగా ఎద‌గ‌డానికి శ‌ర‌వేగంగా అభివృద్ధి చెందుతూ ముందుకెళ్తుంది అని మంత్రి కేటీఆర్ తెలిపారు. 2015లో ఒక జీవో ద్వారా కార్పొరేష‌న్ ఎన్నిక‌లు జ‌రిగిన‌ప్పుడు 50 శాతం స్థానాల‌ను మ‌హిళ‌ల‌కే ఆమోదించుకున్నాం. మ‌హిళా సాధికార‌త‌కు పెద్ద‌పీట వేయాల‌నే ఆలోచ‌న‌తో మ‌హిళా రిజ‌ర్వేష‌న్ల‌కు ఇవాళ చ‌ట్టం చేసుకుంటున్నామ‌ని తెలిపారు. 79 స్థానాల్లో మ‌హిళ‌ల‌ను గెలిపించిన చ‌రిత్ర టీఆర్ఎస్ పార్టీకే ద‌క్కుతుంద‌న్నారు. 50 శాతం మహిళలకు రిజర్వేషన్, జీహెచ్‌ఎంసీ బడ్జెట్‌లో 10 శాతం నర్సరీలు,మోక్కలు పెంపకం వంటి ఈ సవరణలో చేర్చామని తెలిపారు.

హైద‌రాబాద్ న‌గరానికి 429 సంవ‌త్స‌రాల కింద‌ట బీజం ప‌డింది. 1869లో హైద‌రాబాద్‌ మున్సిపాలిటీగా, 1933లో చాద‌ర్‌ఘాట్ అనే మ‌రో మున్సిపాలిటీ, 1937 జూబ్లీహిల్స్ మున్సిపాలిటీ, 1945లో సికింద్రాబాద్ అనే మున్సిపాలిటీ ఏర్ప‌డింది. 1948-56 మ‌ధ్య కాలంలో హైద‌రాబాద్ స్టేట్‌గా ఉన్న‌‌ప్పుడే 1955లోనే హైద‌రాబాద్ మున్సిప‌ల్ కార్పొరేష‌న్ ఏర్ప‌డింది. హెచ్ఎంసీ యాక్ట్ కింద నాడు కార్పొరేష‌న్ ఏర్పాటు చేశారని తెలిపారు కేటీఆర్.