బిగ్ బాస్‌ 4…ట్రయాంగిల్ లవ్‌స్టోరీకి బ్రేకప్‌!

146
akhil

బిగ్ బాస్ తెలుగు సీజన్ 4 విజయవంతంగా 37 ఎపిసోడ్స్ పూర్తి చేసుకోగా ప్రస్తుతం హౌస్‌లో 13 మంది సభ్యులు ఉన్నారు. ఇక ఇందులో రొమాంటిక్,ట్రయాంగిల్ లవ్ స్టోరీతో ఎప్పుడూ వార్తల్లో నిలుస్తున్నారు అభిజిత్,అఖిల్,మోనాల్.

మోనాల్ ఇద్దరిని బ్యాలెన్స్ చేస్తూ ఎవరి మనసు నొప్పించకుండా ఇప్పటివరకు వచ్చింది. అయితే ఈ ఆదివారం ఎపిసోడ్‌తో మోనాల్‌ చేసిన పని అభిజిత్‌కి ఆగ్రహం తెప్పించింది. ఇదే విషయాన్ని మోనాల్‌ దగ్గర ప్రస్తావన తీసుకొచ్చిన అభి…ఆమె నిర్ణయాన్ని తప్పుబట్టారు.

నీకు నాకు మధ్య ఏం లేదా?? మోనాల్ అంటూ అభి నామినేషన్స్ టాపిక్ తీసుకొస్తూ ఇది అమ్మాయి ఇష్యూ అంటున్నావ్ దాన్ని ఉమెన్ ఇష్యూలా చూపించకు అని మండిపడ్డారు. అఖిల్‌కి నీ మీద అంత ప్రేమ, కేర్ ఉంటే నేషనల్ టీవీలో వచ్చేస్తుందని అంటే నామినేషన్ ప్రక్రియలో నీ పేరు ఎందుకు ప్రస్తావించాడని ప్రశ్నించారు.

నీ బెడ్ రూంలో కూర్చుని అఖిల్‌ది తప్పని అన్నావ్.. నాగ్ సార్ ముందు ఇద్దరిదీ తప్పు అంటావా?? నాకు నువ్ ఏం చేస్తున్నావో అర్ధం అయిందని మండిపడ్డారు. నీతో మాట్లాడకపోతే బెటర్ అనిపిస్తుంది.. ఏదోటి చెప్ప.. నువ్ హ్యాపీగా ఉండొచ్చు.. నా పని నేను చూసుకోవచ్చు.. నిన్ను తప్పుపట్టడం వేస్ట్ అంటూ కుండబద్దలు కొట్టినట్టు చెప్పేశాడు అభిజిత్. అయితే కనీసం గుడ్ మార్నింగ్ అయినా చెప్పుకుందాం అని మోనాల్ తెలపగా ఆలోచించి చెప్తా అని మోనాల్‌పై కోపంతో వెళ్లిపోయాడు అభి. తర్వాత ఉదయాన్నే నిద్రలేస్తూ అఖిల్‌కి ఘాటుగా హాగ్ ఇస్తూ అభిజిత్‌తో కటీఫ్ అయినట్లేననే సంకేతాన్ని ఇచ్చింది మోనాల్.