తండ్రికి తగ్గ తనయుడు..హిమాన్షుకు గోల్డ్ మెడల్‌

320
ktr son
- Advertisement -

తండ్రికి తగ్గ తనయుడు, తాతకు తగ్గ మనవడు అని నిరూపించుకున్నాడు కేటీఆర్ కుమారుడు హిమాన్షు. డీహెచ్‌ఎఫ్‌ఎల్‌ ప్రమెరికా లైఫ్‌ ఇన్సూరెన్స్‌ సంస్థ నిర్వహించిన బెహతర్‌ ఇండియా వాతావరణ్‌ ప్రచార కార్యక్రమంలో భాగంగా నిర్వహించిన పర్యావరణ విభాగం పోటీలలో గోల్డ్ మెడల్ సాధించాడు.

ఖాజాగూడలోని ఓక్రిడ్జ్‌ ఇంటర్నేషనల్‌ స్కూల్‌లో 8వ తరగతి చదువుతున్న హిమాన్షు 29,482 కిలోల రీసైక్లింగ్ వ్యర్థాలను సేకరించి జాతీయస్థాయిలో ఫస్ట్ ప్లేస్‌లో నిలిచాడు. పాఠశాల విభాగంలోనూ ఖాజాగూడలోని ఓక్రిడ్జ్‌ ఇంటర్నేషనల్‌ స్కూల్‌ అవార్డును సొంతం చేసుకుంది. 34,137 కిలోల రీసైకిలబుల్‌ వేస్ట్‌ను సేకరించి మూడో స్థానంలో నిలిచింది.

గురువారం దేశ రాజధాని ఢిల్లీలో జరిగిన కార్యక్రమంలో ఆ సంస్థ బ్రాండ్ అంబాసిడర్ పరిణీతి చోప్రా బహుమతులు అందజేశారు. హిమాన్షు తరఫున స్కూల్ ప్రతినిధులు మెడల్ అందుకొని హైదరాబాద్‌కు పంపించారు. హిమాన్షు గోల్డ్ మెడల్ సాధించడంతో తాత కేసీఆర్ తెలివి, తండ్రి కేటీఆర్ నేర్పరితనం రెండు హిమాన్షు కు వచ్చాయని చర్చించుకుంటున్నారు.

- Advertisement -