మంచి మనసు ఉన్న మన కేటీఆర్‌

190
- Advertisement -

నవంబర్‌ 14న మన ప్రధమ భారత ప్రధాని నెహ్రూ జయంతి రోజున చిల్డ్రన్స్‌డే జరుపుకుంటాము. ఈ సందర్భంగా హైదరాబాద్‌లోని గోల్డెన్ సిటీ కాలనీ చెందిన మాస్టర్ ఉమర్‌ మంత్రి కేటీఆర్ ట్వీట్ చేశారు. ఎందుకో తెలుసా… వివారాల్లోకి వెళ్తే గోల్డెన్ సిటీ కాలనీలో గత ఐదేండ్ల నుంచి తాగునీటి సమస్య ఉందని చిన్నారి ఉమర్ తన ట్వీట్‌లో పేర్కొన్నాడు.

డ్రింకింగ్ వాటర్‌ పైప్‌లైన్‌ కోసం ఎదురుచూస్తున్నామని తెలిపాడు. అన్ని ట్యాక్సులు చెల్లిస్తున్నామని చెప్పాడు. దీంతో ఈ ట్వీట్‌పై మంత్రి కేటీఆర్ స్పందించాడు. గోల్డెన్ సిటీ కాలనీకి వెళ్లి సమస్య పరిష్కారించాలని జలమండలి ఎండీ దాన కిశోర్‌కు మంత్రి ఆదేశాలు జారీ చేశారు.

మంత్రి కేటీఆర్‌ ట్వీట్ ఆదేశాలతో జలమండలి ఎండీ దాన కిశోర్‌ గోల్డెన్ సిటీ కాలనీకి వెళ్లి పరీశిలించారు. ఈ సందర్భంగా కేటీఆర్‌కు రిట్వీట్‌ చేస్తూ.. గోల్డెన్ సిటీ కాల‌నీకి వెళ్లి చిన్నారి ఉమ‌ర్‌ను క‌లిశాం. ఈ ఏరియాకు వాట‌ర్ పైపులైన్ కోసం రూ. 2.85 కోట్లు నిధులు మంజూర‌య్యాయ‌ని తెలిపారు.

వ‌ర్షాకాలం కార‌ణంగా మొన్న‌టి వ‌ర‌కు ప‌నులు చేప‌ట్ట‌లేదు. త్వ‌ర‌లోనే ప‌నులు ప్రారంభిస్తాం. వాట‌ర్‌లైన్‌కు ఉమ‌ర్ నివాసం 3.94 కిలోమీర్ల దూరంలో ఉంద‌ని, అందుకు గానూ రూ. 94 ల‌క్ష‌లు ఖ‌ర్చు అవుతుంద‌ని తెలిపారు. రెండు వారాల్లో ఆ ఏరియాకు తాగునీటి స‌ర‌ఫ‌రా చేస్తామ‌ని జ‌లమండ‌లి ఎండీ దాన కిశోర్ స్ప‌ష్టం చేశారు. ఈ సంద‌ర్భంగా ఎండీ దాన కిశోర్‌కు మంత్రి కేటీఆర్ అభినంద‌న‌లు తెలిపారు.

ఇవి కూడా చదవండి..

అత్యవసరసంగా ల్యాండ్‌ అయిన ఇండిగో

కుర్ర హీరోను సాంతం నాకేస్తోందట

మహేష్ కి దెబ్బ మీద దెబ్బ !

- Advertisement -