రేవంత్‌ది దివాళకోరు రాజకీయం:కేటీఆర్

12
- Advertisement -

టీఎస్పీఎస్సీ ద్వారా 60, 918 ఉద్యోగాలకు అనుమతులిస్తే…54, 015 ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇచ్చాం. 35,250 ఉద్యోగాలు భర్తీ చేశాం.18, 765 ఉద్యోగాలు ప్రక్రియలో ఉన్నాయన్నారు కేటీఆర్. తెలంగాణ భవన్‌లో మీడియాతో మాట్లాడిన కేటీఆర్..పోలీస్ రిక్రూట్ మెంట్ బోర్డు ద్వారా 50,425 ఉద్యోగాలకు అనుమతులిస్తే… 48, 247 పోస్టులకు నోటిఫికేషన్ ఇచ్చాం. 47,068 ఉద్యోగాలు భర్తీ చేశాం. 1179 భర్తీ దశలో ఉన్నాయన్నారు.

గురుకుల రిక్రూట్ మెంట్ బోర్డు ద్వారా 17,631 పోస్టులకు అనుమతులిస్తే… 12, 904 పోస్టులకు నోటిఫికేషన్ ఇచ్చాం. 3,694 భర్తీ చేశాం. 9210 భర్తీ దశలో ఉన్నాయి..డీఎస్సీ ద్వారా 34,100 పోస్టులకు అనుమతులిస్తే… 28,534 పోస్టులకు అనుమతులిచ్చాం. 22, 892 పోస్టులు భర్తీ చేశాం. 5,642 పోస్టులు భర్తీ దశలో ఉన్నాయి..మెడికల్ రిక్రూట్ మెంట్ బోర్డు ద్వారా 14,283 ఉద్యోగాలకు అనుమతులిస్తే… 9,684 పోస్టులకు నోటిఫికేషన్ ఇచ్చాం. 2,047 భర్తీ చేశాం. 7,637 భర్తీ దశలో ఉన్నాయి. యూనివర్సిటీ కామన్ బోర్డు పెట్టాం. కానీ ఆ బిల్లును గవర్నర్ గారు అడ్డుకున్నారు. లేదంటే 105 పోస్టులు భర్తీ అయ్యేవన్నారు. ఇతర సంస్థలన్నీ కలుపుకుంటే 54,846 ఉద్యోగాలు. అందులో49,341 పోస్టులకు నోటిఫికేషన్ ఇచ్చాం. భర్తీ చేసివవి 49,132. భర్తీ దశలో 219 ఉద్యోగాలు ఉన్నాయన్నారు.

కేసీఆర్ పదేళ్లలో 2,32,308 ఉద్యోగాలకు పరిపాలన అనుమతలు ఇచ్చారు. 2,02, 735 ఉద్యోగాలకు నోటిఫికేషన్లు ఇచ్చారు…వీటిలో 1,60,083 ఉద్యోగాలను భర్తీ చేశాం. 42,652 ఉద్యోగాలు భర్తీ దశలో ఉన్నాయి..కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి…30 వేల ఉద్యోగాలు ఇచ్చినట్లు ఊదరగొడుతున్నాడన్నారు.వాళ్ల కాంగ్రెస్ నాయకులు కూడా అవే అబద్దాలను సిగ్గు లేకుండా మాట్లాడుతున్నారు…30 వేల ఉద్యోగాలు ఇస్తే ఎప్పుడు నోటిఫికేషన్, ఎప్పుడు రాత పరీక్ష జరిపారో తారీఖులు చెప్పాలన్నారు.ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి తెలంగాణ ప్రజలకు రేవంత్ రెడ్డి పచ్చి అబద్దాలు చెబుతున్నాడన్నారు.రేవంత్ రెడ్డి దుర్మార్గాలను బట్టబయటలు చేసే వివరాలను నేను చెబుతాను…గురుకులాల్లో టీజీటీ, పీజీటీ లో 9210 పోస్టులకు ఏప్రిల్, 2023 లో నోటిఫికేషన్ ఇచ్చాం. ఆగస్ట్ 2023 లో ఎగ్జామ్స్ జరిగాయి. ఫిబ్రవరి 2024లో ఫలితాలు వచ్చాయన్నారు. ఈ పోస్టులను కూడా రేవంత్ రెడ్డి రాజకీయ దివాళా కోరతనానికి నిదర్శనం అని మండిపడ్డారు.

Also Read:KTR:స్థానికులకు రిజర్వేషన్లు ఇచ్చిన ఘనత కేసీఆర్‌దే

- Advertisement -