స్కూల్ పిల్లల ముందు రాజకీయాలా?

1
- Advertisement -

ఆరుట్ల స్కూల్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పిల్లల ముందు కూడా రేవంత్ రెడ్డి రాజకీయాలు మాట్లాడుతున్నాడు అని మాజీ మంత్రి హరీష్ రావు మండిపడ్డారు . హరీష్ రావు తాటిచెట్టు లెక్క పెరిగాడు అని అక్కడ పిల్లల ముందు చెప్తున్నాడు…నా ఎత్తు గురించి ఆ పిల్లలకు ఎందుకు రేవంత్ రెడ్డి? అని ప్రశ్నించారు.

రైతుబంధు, రైతుభీమా, ఫీజు రీయింబర్స్‌మెంట్ ఇవ్వమంటే నా ఎత్తు గురించి మాట్లాడుతున్నాడు… నువ్వు నన్ను ఎన్ని మాటలు అన్నా కూడా నిన్ను ప్రశ్నిస్తూనే ఉంటాను అని స్పష్టం చేశారు.

33 కులాలకు 33 కార్పొరేషన్లు వేశారు కానీ ఒక్కరికి ఒక్క రూపాయి కూడా సాయం అందలేదు అన్నారు. కార్పొరేషన్లకు మాత్రం చైర్మెన్లను పెట్టి వాళ్లకు ఒక కారు, ప్యూన్, ఫ్యాన్ ఇచ్చాడు అంతే తప్ప ఎవరికి ఒక్క రూపాయి కూడా సాయం జరగలేదు అన్నారు.

ALso Read:రాజీనామా చేసి వెళ్లండి:సంజయ్

- Advertisement -