- Advertisement -
కిడ్నీ సమస్యతో బాధపడుతున్న వరంగల్ బాలుడు నిరంజన్ కుటుంబానికి అండగా నిలిచారు నిర్మాత బండ్ల గణేష్. పరమేశ్వర ఆర్ట్ ప్రొడక్షన్స్ తరఫున బాలుడి వైద్య ఖర్చులకు రూ.5 లక్షల భారీ ఆర్థిక సహాయం ప్రకటించారు.
తీవ్ర అనారోగ్యంతో ఉన్న 17 ఏళ్ల పొనుగోటి నిరంజన్ పరిస్థితిపై తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు బండ్ల గణేష్. పవన్ కళ్యాణ్‌ను కలవాలన్న నిరంజన్ కోరిక మీడియా ద్వారా తెలిసి చలించిపోయారు జనసేనాని.
అభిమానిని పరామర్శించేందుకు స్వయంగా హనుమకొండకు వచ్చారు డిఫ్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. పవన్ కళ్యాణ్ భక్తుడిగా, ఆయన స్ఫూర్తితోనే ఈ ఆర్థిక సాయాన్ని ప్రకటిస్తున్నట్లు తెలిపారు బండ్ల గణేష్. కష్టకాలంలో నిరంజన్ కుటుంబానికి పెద్ద మొత్తంలో ఆర్థిక భరోసా కల్పించారు బండ్ల గణేష్.

- Advertisement -

