సవాళ్లు విసిరి.. పారిపోవడం రేవంత్ కు కొత్త కాదు అని మండిపడ్డారు మాజీ మంత్రి కేటీఆర్. రేవంత్ మాట మీద నమ్మకం లేకనే మేమే ప్రెస్ క్లబ్ బుక్ చేసినం అన్నారు. రేవంత్ రెడ్డి ఢిల్లీకి పోయిండు…ముఖ్యమంత్రి తరపున ఎవరు వచ్చినా.. మేము చర్చించడానికి సిద్ధంగా ఉన్నాం అన్నారు.
కొడంగల్‌లో ఇంతవరకు రైతుబంధు పడని 670 మంది జాబితాతో ప్రెస్‌క్లబ్‌కు వచ్చానని తెలిపారు. రైతు శ్రేయస్సుకు సంబంధించి ప్రతి అంశం మీద చర్చించడానికి మా పార్టీ నాయకత్వం సిద్ధమై మొత్తం సమాచారంతో సహా ప్రెస్‌క్లబ్‌కు వచ్చామని తెలిపారు.
రేవంత్ రెడ్డి వస్తాడు అనుకుంటే నిన్ననే బయలుదేరి ఢిల్లీకి వెళ్లాడు.. మరి చర్చకు ముఖ్యమంత్రి బదులు వ్యవసాయ మంత్రి వస్తాడా, ఉపముఖ్యమంత్రి వస్తాడా, లేదా ఇంకా ఎవరైనా మంత్రి వస్తారా అని మేము ఎదురు చూస్తూ ఉంటాము అని వెల్లడించారు.
Also Read:కీరవాణి ఇంట విషాదం..

