KTR:రాష్ట్రంలో ఎమర్జెన్సీ,కోవర్టు పాలన

2
- Advertisement -

రాష్ట్రంలో చంద్రబాబు కోవర్టు పాలన నడుస్తుంది అని ఆరోపించారు మాజీ మంత్రి కేటీఆర్. తెలంగాణ రైతులను మోసం చేస్తూ నీళ్లు ఏమో గురువు చంద్రబాబుకి, నిధులు ఢిల్లీకి, నియామకాలు రేవంత్ రెడ్డి తొత్తులకి పోతున్నాయి అన్నారు.

రేవంత్ రెడ్డి పాలన ఎమర్జెన్సీ పాలనను తలపిస్తుంది అని… సోషల్ మీడియా పోస్ట్ రీట్వీట్ చేసినందుకు బలహీన వర్గానికి చెందిన శశిధర్ గౌడ్ అనే కార్యకర్తను అక్రమంగా అరెస్ట్ చేశారు అన్నారు. అడ్డగోలు హామీలతో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది అన్నారు.

అన్నివర్గాల ప్రజలను కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేస్తోంది ..హామీల అమలుపై ప్రభుత్వాన్ని 18 నెలలుగా నిలదీస్తున్నాం అన్నారు. కాంగ్రెస్ మోసాలను ఎండగడుతున్నాం ..శాసనసభలో చర్చ పెట్టరు.. మైక్ ఇవ్వరు ,ఆడబిడ్డలు నిలబడి మైక్ ఇవ్వమంటే ఇవ్వరు ,అభివృద్ధిపై చర్చకు రావాలని రేవంత్‌రెడ్డిని ఎన్నోసార్లు ఆహ్వానించాం అన్నారు.

అసెంబ్లీలో కాదంటే.. ప్రెస్‌క్లబ్‌లోనైనా చర్చకు రావాలని చెప్పాం..రుణమాఫీ, రైతు బోనస్ వంటి అంశాలపై చర్చకు రావాలని ఆహ్వానించాం అన్నారు. సీఎం రాకుంటే మంత్రులైనా చర్చకు రావాలి …సీఎం ఇవాళ హాజరుకాకుంటే మరో రోజు చర్చకైనా మేం సిద్ధం,రేవంత్‌రెడ్డికి వీలైన తేదీ, ప్రదేశం చెప్పాలని అడుగుతున్నాం అన్నారు. అసెంబ్లీలో మైక్ కట్ చేయకుండా..మాట్లాడనిస్తామని హామీ ఇస్తే అసెంబ్లీలో కూడా సిద్ధం , రేవంత్‌రెడ్డి తప్పుకుంటే కేసీఆర్ చేసి చూపిస్తారు అన్నారు.

Also Read:కీరవాణి ఇంట విషాదం..

- Advertisement -