ఉపాధి హామీ సిబ్బంది జీతాలేవి?:హరీష్

10
- Advertisement -

ఉపాధి హమీ ఏపీఓలకు మూడు నెలలుగా జీతాలు చెల్లించకపోవడం శోచనీయం అన్నారు మాజీ మంత్రి హరీష్ రావు. చేసిన పనికి వేతనాలు రాక ఉపాధి హమీ సిబ్బంది ఆర్థికంగా ఇబ్బందులు పడుతూ కుటుంబ పోషణ భారమై సతమతమవుతుంటే ఈ ప్రభుత్వం పట్టనట్లు వ్యవహరించడం దుర్మార్గం అన్నారు.

కాంగ్రెస్ ప్రభుత్వ నిర్లక్ష్యానికి మనోవేదనకు గురై ఉపాధి హామీ ఉద్యోగులు ప్రాణాలు కోల్పోయే పరిస్థితి రావడం విచారకరం…మరోవైపు పారిశుధ్య కార్మికులకు కూడా వేతనాలు రాక గ్రామాల్లో పారిశుద్ధ్యం పడకేసింది అన్నారు.

ఎన్నికల సమయంలో హామీలతో ఊదరగొట్టిన కాంగ్రెస్ నాయకులు ఇప్పుడు ఏమని సమాధానం చెబుతారు?, సీఎం రేవంత్ రెడ్డి తక్షణమే స్పందించి ఉపాధి హామీ ఏపీవోలు, పారిశుధ్య కార్మికుల పెండింగ్ లో ఉన్న వేతనాలు వెంటనే చెల్లించాలని బీఆర్ఎస్ పక్షాన డిమాండ్‌ చేస్తున్నాం అన్నారు.

 

Also Read:‘కాంతార: చాప్టర్ 1’..రిలీజ్ డేట్

- Advertisement -