KTR:రైతులను ఆగం చేసిన కాంగ్రెస్

53
- Advertisement -

అధికారంలోకి రాకముందే రైతులను కాంగ్రెస్ పార్టీ ఆగం చేసిందన్నారు మంత్రి కేటీఆర్. పెద్దపల్లి నియోజకవర్గం సుల్తానాబాద్‌లో రోడ్ షోలో మాట్లాడిన కేటీఆర్… రైతు బంధును కాటగలిపి రైతుల నోట్లో కాంగ్రెస్ నేతలు మట్టిగొట్టారని మండిపడ్డారు. కాంగ్రెస్‌ పార్టీ కొత్తదేమీ కాదని, చెత్తపార్టీ అని మండిపడ్డారు.

ఇప్పటివరకు కాంగ్రెస్‌కు 11 సార్లు అవకాశమిస్తే ప్రజలకు చేసిందేమీ లేదన్నారు. రైతులను ఆగం చేసిందని, మన బతుకులను నాశనం చేసిందని, తెలంగాణను బొందపెట్టే ప్రయత్నం చేసిన పార్టీ అని మండిపడ్డారు. చావు నోట్లోపెట్టి కేసీఆర్‌ తెలంగాణను సాధించారని, ప్రజలంతా అవకాశం ఇస్తే ముఖ్యమంత్రిగా రెండు టర్ములు పనిచేశారని చెప్పారు. రైతుబంధును ప్రవేశపెట్టిందే కేసీఆర్‌ అని, రైతుబీమా, కల్యాణ లక్ష్మీ, షాదీ ముబారక్‌, రూ.2 వేల పెన్షన్‌, ఆడబిడ్డలకు కేసీఆర్‌ కిట్‌ ఇచ్చారని చెప్పారు.

మరోసారి అధికారంలోకి వస్తే ఆడపిల్లల కోసం నెలకు రూ.3 వేల ఇచ్చేలా సౌభాగ్యలక్ష్మి పథకం తీసుకొస్తున్నామని, ఆసరా పెన్షన్లను రూ.5 వేలకు పెంచుతామన్నారు. మోడీ పెంచిన సిలిండర్‌ ధరను తగ్గిస్తున్నామని రూ.400లకే అందిస్తామని చెప్పారు.

Also Read:CM KCR:అసైన్డ్ భూములకు పట్టాలిస్తాం..

- Advertisement -