రాజకీయాలే తప్ప రైతుల సమస్యలు తప్పవా అని సీఎం రేవంత్ రెడ్డిపై మండిపడ్డారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. వడ్లు కొనుగోలు చేయడం లేదని రైతులు ఆందోళన చేస్తున్నారు… ధాన్యం కొనుగోళ్లపై ప్రభుత్వం వెంటనే స్పందించాలని డిమాండ్ చేశారు. మీడియాతో మాట్లాడిన కేటీఆర్…రైతుల పక్షాన పోరాటం చేసేందుకు మేము సిద్ధంగా ఉన్నామని చెప్పారు.
తెలంగాణ సర్కార్ రైతులను విస్మరించిందని…అకాల వర్షాలకు పంటలు దెబ్బతిని రైతులకు తీవ్ర నష్టం వాటిల్లిందన్నారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానంను నిలబెట్టుకుంటామని అన్నారు. నాలుగు సార్లు ఎమ్మెల్సీస్థానాన్ని గెలిచాం. ఇప్పుడు కూడా గెలుస్తామని చెప్పారు. కాంగ్రెస్ నిరుద్యోగులను మోసం చేసింది… రేవంత్ రెడ్డి విద్యుత్ ఉద్యోగులపై ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారన్నారు.
ఉద్యోగులను నిందించడం తగదు. ప్రభుత్వ ఉద్యోగులను సీఎం నమ్మడం లేదు. నారాయణఖేడ్ లో ఉపాధ్యాయులపై లాఠీ ఛార్జ్ చేశారు. దివాళాకోరు రాజకీయం సీఎం రేవంత్ రెడ్డి చేస్తున్నారని కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
Also Read:బడ్డీ.. ఫస్ట్ లిరికల్ రిలీజ్