అందాల పోటీలకు 250 కోట్లు పెట్టడానికి డబ్బులు ఉన్నాయి రిటైర్ అయిన ఉద్యోగులకు ఇవ్వడానికి డబ్బులు లేవా చెప్పాలని డిమాండ్ చేశారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. తెలంగాణ భవన్‌లో మీడియాతో మాట్లాడిన కేటీఆర్… చివరిసారిగా చెప్తున్నా రేవంత్ రెడ్డి.. కేసీఆర్‌ని వ్యక్తిగతంగా దూషిస్తే నీ నాలుక చీరేస్తా అని హెచ్చరించారు.
రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేసిన రోజు బీఆర్ఎస్ ప్రభుత్వం రూ.6 లక్షల కోట్లు అప్పు చేశారు అని అన్నాడు.. నిన్న రూ.8,29 లక్షల కోట్లు అని చెపుతున్నాడు, పూటకో లెక్క మాట్లాడుతూ, సంఖ్య పెంచుతున్నాడు.. కానీ బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన అసలు అప్పు రూ.4 లక్షల 17 వేల కోట్లు మాత్రమేనన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అసలు, వడ్డీ కలిపి నెలకు చెల్లించే అప్పు కేవలం రూ.2000 కోట్లు మాత్రమేనన్నారు.
ఇది కాగ్ లెక్క..మీ లాగా కాకి లెక్క కాదు అన్నారు. చెప్పులు ఎత్తుకపోవడానికి వేరే పార్టీ వాళ్ళు రెడీగా ఉన్నారు… ఢిల్లీకి మూటలు మోయడానికి పోతే దొంగ లెక్కనే చూస్తారు అన్నారు. ఫోర్త్ సిటీలో 2000 ఎకరాలు ఎట్లా కొన్నావు రేవంత్ రెడ్డి ?… నీ అన్నదమ్ములు, నీ బామ్మర్ది, నీ కుటుంబ సభ్యులు అందరి ఆదాయం పెంచుకున్నావు, కానీ రాష్ట్ర ఆదాయం ఎందుకు పెరగలేదు చెప్పాలన్నారు.
పెట్రోల్, డీజిల్ ధరలు పెంచి లీటర్ రూ.200 చేసి సంపద పెంచాలని అనుకుంటున్నాడు… ధరలు పెంచడం కాదు రేవంత్ రెడ్డి, బుర్ర పెంచు.. సంపద పెంచే ఆలోచన చేయి అన్నారు.
Also Read:గుడ్ న్యూస్ చెప్పిన వరుణ్ తేజ్

