ఆర్టీసీ కార్మికులు తలపెట్టిన సమ్మె వాయిదా పడింది. మంత్రి పొన్నం ప్రభాకర్‌తో ఆర్టీసీ జేఏసీ చర్చలు సఫలం కావడంతో సమ్మెను వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు ఆర్టీసీ యూనియన్ నాయకులు. సమస్యల పరిష్కారానికి ఉద్యోగ సంఘాలతో చర్చించేందుకు ముగ్గురు ఐపీఎస్ అధికారులతో కూడిన కమిటీని వేసింది ప్రభుత్వం. ఇందులో నవీన్ మిట్టల్,లోకేశ్, కృష్ణ భాస్కర్ సభ్యులుగా ఉండగా వీలైనంత త్వరగా నివేదిక ఇవ్వాలని ఆదేశించింది ప్రభుత్వం.
ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయడం సహా 21 సమస్యలతో కూడిన డిమాండ్లను ప్రభుత్వం ముందు ఉంచారు ఆర్టీసీ కార్మిక సంఘాల నేతలు. అయితే సమ్మె వద్దని, చర్చల ద్వారా సమస్యలను పరిష్కరించుకోవాలని ఆర్టీసీ కార్మికులను ప్రభుత్వం కోరింది.
ఈ క్రమంలో ఆర్టీసీ ఉద్యోగులు ఎదుర్కొంటున్న సమస్యలపై వారితో చర్చించారు మంత్రి పొన్నం. చర్చలు ఫలించడంతో ఆర్టీసీ సమ్మె వాయిదా పడింది.
Also Read:గుడ్ న్యూస్ చెప్పిన వరుణ్ తేజ్

