బీఆర్ఎస్ సభ.. కేటీఆర్ షెడ్యూల్

19
- Advertisement -

తెలంగాణ రాష్ట్ర సాధనే లక్ష్యంగా పురుడు పోసుకున్న బీఆర్ఎస్ పార్టీకి 25 సంవత్సరాలు నిండాయి. 2001లో ఏర్పడి 2014లో రాష్ట్రాన్ని సాధించే దాకా పుట్టిన గడ్డ విముక్తి కోసం లెక్కలేనన్ని పోరాటాలు చేసిన బీఆర్ఎస్, అధికారంలోకి వచ్చిన తరువాత పదేండ్ల పాటు సుపరిపాలన అందించి దేశంలోనే నెంబర్ వన్ రాష్ట్రంగా తెలంగాణను నిలిపింది. ఇక బీఆర్ఎస్ ఆవిర్భవించి 25 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా పార్టీ రజతోత్సవ వేడుకను నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే.

() ఉదయం 9 గంటలకు తెలంగాణ భవన్ లో జెండా ఆవిష్కరణ చేస్తారు.

() ఉదయం 10 గంటలకు ట్యాంకు బండ్ వద్ద ఉన్న కొండ లక్ష్మణ్ బాపూజీ గారి విగ్రహానికి నివాళులు అర్పిస్తారు.

() ఉదయం 10:30 గంటలకు ఎల్కతుర్తి కి బయలుదేరుతారు.

() మధ్యాహ్నం 2 గంటలకు ఎల్కతుర్తిలో బీఆర్‌ఎస్‌ రజతోత్సవ మహాసభ వద్దకు చేరుకుంటారు.

ఇక సభకోసం రాష్ట్రంలోని నలుమూలల నుంచి దాదాపు 50 వేల వాహనాల వస్తాయని అంచనా వేస్తున్నారు. పార్కింగ్‌ కోసం 1,059 ఎకరాలను కేటాయించారు. వీఐపీ వాహనాల కోసం సభావేదిక ఎడమ భాగం, వెనుక భాగంలో పార్కింగ్‌ను ఏర్పాటుచేశారు. సభకు వచ్చే ప్రజల కోసం లక్షకు పైగా కుర్చీలను ఏర్పాటు వేశారు. మహిళల కోసం ప్రత్యేక కుర్చీలు వేసి బారికేడ్లు పెట్టారు. లైట్లు, ఎల్‌ఈడీల కోసం 200 భారీ జనరేటర్లను ఏర్పాటుచేశారు. కేసీఆర్‌ అందరికీ స్పష్టంగా కనిపించేలా 20/50 సైజుతో కూడిన 23 ఎల్‌ఈడీ భారీ స్క్రీన్లు, భారీ సౌండ్‌ సిస్టంను చుట్టుపక్కల ఏర్పాటుచేశారు.

Also Read:Kaantha:సముద్రఖని..ఫస్ట్ లుక్

- Advertisement -