ప్రజల సంక్షేమమే నిజమైన అభివృద్ధి:కేటీఆర్

206
ktr seminar
- Advertisement -

ప్రజల సంక్షేమమే నిజమైన అభివృద్ధి అని స్పష్టం చేశారు మంత్రి కేటీఆర్. హైదరాబాద్‌లో సెంటర్ ఫర్ ఎకానామిక్స్ సోషల్ స్టడీస్‌లో సమీకృత అభివృద్ధి,సమస్యలు,సవాళ్లు అంనే అంశంపై జరిగిన సెమినార్‌లో మాట్లాడిన కేటీఆర్ అభివృద్ధిలో తెలంగాణ నెంబర్‌ 1గా నిలిచిందన్నారు. నాలుగేళ్లలో రాష్ట్ర వృద్ధి రేటు 17.7 శాతంగా నమోదైందన్నారు.

దేశంలో కేవలం సంక్షేమ పథకాల కోసమే రూ.45 వేల కోట్లు ఖర్చు చేస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అన్నారు. గ్రామీణ ప్రాంతాల ప్రజల జీవన ప్రమాణాలు పెంచేందుకు సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నామని చెప్పారు. వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చేందుకు రైతుబంధు పథకం అమలు చేస్తున్నామని తెలిపారు. 55 లక్షల మంది రైతులు ఈ పథకం ద్వారా లబ్ది పొందుతున్నారని చెప్పారు.

సామాజిక వృద్ధిలో భాగంగా అనేక సంక్షేమ పథకాలు తీసుకొచ్చాం. పింఛన్లు, కల్యాణలక్ష్మి, షాదీముబారక్, రైతుబంధు పథకాలు తీసుకొచ్చామని తెలిపారు. తెలంగాణను దేశంలోనే ఆదర్శంగా తీర్చిదిద్దుతున్నామని చెప్పారు. గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక వసతులను కల్పించేందుకు కృషి చేస్తున్నామని చెప్పారు. ఈ సందర్భంగా సెస్ ఛైర్మన్ రాధాకృష్ణ రచించిన ఇండియన్ ఎకానమీ పుస్తకాన్ని కేటీఆర్ ఆవిష్కరించారు.

- Advertisement -