కాంగ్రెస్‌కు పరాభవం తప్పదు:కేటీఆర్

22
- Advertisement -

పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు పరాభవం తప్పదన్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. పార్ల‌మెంట్ ఎన్నిక‌ల త‌ర్వాత ప్రాంతీయ పార్టీల‌దే హ‌వా అని తెలిపారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో మాట్లాడిన కేటీఆర్… ఇండియా, ఎన్డీఏ కూట‌మిల‌కు స్ప‌ష్ట‌మైన మెజార్టీ వ‌చ్చే పరిస్థితి లేదన్నారు.

ఈ ఐదు నెల‌ల్లో కాంగ్రెస్ ఎక్క‌డ లేని వ్య‌తిరేక‌త‌ను మూట‌గ‌ట్టుకుందన్నారు. ఐదు నెల‌ల్లోనే అసాధార‌ణ వ్య‌తిరేక‌త వ‌చ్చిందని…. క్షేత్ర స్థాయిలో బాగాలేదు అన్నారు. ఈ ఎన్నిక‌ల త‌ర్వాతనైనా కాంగ్రెస్ బుద్ది తెచ్చుకొని 420 హామీలు అమ‌లు చేయ‌క‌పోతే ప్ర‌జాక్షేత్రంలో ప‌రాభ‌వం త‌ప్ప‌దు అని మండిపడ్డారు.

పార్ల‌మెంట్ ఎన్నిక‌ల్లో గులాబీ సైనికులు అద్భుత‌మైన పోరాట ప‌టిమ ప్ర‌ద‌ర్శించారని..మంచి ఫ‌లితాలు సాధించ‌బోతున్నాం అన్నారు. ఈనాడైనా ఏనాడైనా బీఆర్ఎస్ పార్టీనే తెలంగాణ ప్ర‌యోజ‌నాల‌కు శ్రీరామ‌ర‌క్ష అని ప్ర‌జ‌ల‌కు అర్థ‌మైందన్నారు.

Also Read:Akhilesh:బీజేపీ గ్రాఫ్ పతనమవుతోంది

- Advertisement -