KTR:పార్టీ ఫిరాయింపులపై రాష్ట్రపతికి ఫిర్యాదు

27
- Advertisement -

పార్టీ ఫిరాయింపులపై రాష్ట్రపతికి ఫిర్యాదు చేస్తామని తెలిపారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. మాజీ మంత్రి హరీశ్‌ రావు, ఎంపీలు సురేశ్‌ రెడ్డి, దీవకొండ దామోదర్‌ రావు, వద్దిరాజు రవిచంద్రతో కలిసి కేటీఆర్‌ ఢిల్లీలో మీడియాతో మాట్లాడారు.  యాంటి డిఫెక్షన్ లా తీసుకొచ్చింది కాంగ్రెస్ పార్టీనే అన్నారు. ఇప్పుడు వలసలను ప్రోత్సహించేది కూడా కాంగ్రెస్ పార్టీ నే…వంద రోజుల్లో ఆరు గ్యారెంటీ లు అమలు చేస్తామని రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది…అధికారంలోకి వచ్చిన సంవత్సరంలో 2 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు ఇస్తామని చెప్పారన్నారు.

డిసెంబర్ 9 న రుణ మాఫీ చేస్తామని చెప్పారు…ఇప్పటివరకు ఒక్క హామీ కూడా నెరవేరలేదు అన్నారు. కాంగ్రెస్ ఆరు గారెంటేలు మర్చిపోయి ఆరుగురు ఎమ్మెల్యేలు ఆరుగురు ఎమ్మెల్సీలను చేర్చుకుందని విమర్శించారు. కాంగ్రెస్ నేతలు రాజ్యాంగ ఉల్లంఘనకు పాల్పడుతున్నారన్నారు. గోవా, కర్ణాటక లో బీజేపీ కాంగ్రెస్ ఎమ్మెల్యేలను కొనుగోలు చేస్తుందని రాహుల్ చెప్పుకుంటూ… ఇప్పుడు తెలంగాణాలో BRS ఎమ్మెల్యేలను, ఎమ్మెల్సీలను తమ పార్టీలోకి చేర్చుకుంటున్నారన్నారు.

మణిపూర్ లో ఎమ్మెల్యే పార్టీ ఫిరాయిస్తే.. ఆ ఎమ్మెల్యే నీ సుప్రీం కోర్టు డిస్ క్వాలిఫై చేసిందన్నారు. ఎవరైనా ఎమ్మెల్యే, ఎంపీ పార్టీ ఫిరాయిస్తే వారిని డిస్ క్వాలిఫై అయ్యేలా చట్టం తీసుకురావాలని రాహుల్ గాంధీ చెప్పారు… పార్లమెంట్ లో రాహుల్ గాంధీ రాజ్యాంగాన్ని చూపిస్తారు కానీ ఆ రాజ్యాంగాన్ని ఫాలో అవ్వరు అన్నారు. పార్టీ మారే వాళ్ళని రాళ్లతో కొట్టి చంపాలని గతంలో రేవంత్ రెడ్డి చెప్పారు…తెలంగాణ లో ఎమ్మెల్యేలను ఎన్ని కోట్లు ఇచ్చి కొనుగోలు చేస్తున్నారు అని ప్రశ్నించారు?

కాంగ్రెస్ పార్టీ చేస్తున్న అరాచకాలను డిల్లీ లో బయటపెడతం…పార్టీ మారే ఎమ్మెల్యేలపై స్పీకర్ చర్యలు తీసుకోకుంటే పార్టీ ఫిరాయింపులపై సుప్రీం కోర్టు కి వెళ్తాం అన్నారు.

ALso Read:లక్కీ భాస్కర్..రిలీజ్ డేట్

- Advertisement -