డబుల్ బెడ్ రూం పథకంతో పేదల జీవితాల్లో మార్పు..

190
Minister KTR review on double bed room house scheme
Minister KTR review on double bed room house scheme
- Advertisement -

డబుల్ బెడ్ రూం పథకంతో పేద ప్రజల జీవితాల్లో గుణాత్మక మార్పు వస్తుందని మంత్రులు కెటి రామరావు, ఇంద్రకరణ్ రెడ్డి, మహేందర్ రెడ్డిలు తెలిపారు. ఈ రోజు హైదరాబాద్ నగరంలోని డబుల్ బెడ్ రూం పథకం అమలుపైన మంత్రులు సమీక్ష సమావేశం నిర్వహించారు. బేగంపేటలోని మెట్రోరైలు భవనంలో జరిగిన ఈ సమావేశంలో రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చేల్ జిల్లాల కలెక్టర్లు, జంట నగరాల ఎంఎల్‌ఏలు, హౌసింగ్ శాఖ, జియచ్ యంసి అధికారులు పాల్గోన్నారు.

ఇప్పటికే జియచ్ యంసి తరపున బిల్డర్లకు కావాల్సినన్ని మినహాయింపులు ఇచ్చామని మంత్రి కెటి రామరావు తెలిపారు. ఎంఎల్‌ఏలు నేరుగా వర్కింగ్ ఏజెన్సీలతో మాట్లాడంతో అనేక కంపెనీలు ప్రస్తుతం డబుల్ బెడ్ రూంల నిర్మాణానికి ముందుకు వస్తున్నాయన్నారు. ఈ ఏడాది అర్ధిక సంవత్సరంలో లక్ష ఇళ్ల నిర్మాణం ప్రారంభించి, వచ్చే అర్ధిక సంవత్సరంలో పూర్తి చేయడం లక్ష్యంగా పూర్తి చేస్తామని తెలిపారు. ఇప్పటికే 16562 వేల ఇళ్లకు టెండర్లలు పూర్తి అయ్యాయి. ఇప్పటికే చాల చోట్ల పనులు గ్రౌండ్ అయ్యాయి. మరో 16000 ఇళ్లకు త్వరలో టెండర్లకు పిలుస్తున్నామని, మిగిలిన సూమారు70 వేల ఇళ్లకు ఓకే సారి టెండర్లకు అనుమతి తీసుకుంటున్నామని తెలిపారు. ఇళ్ల నిర్మాణాల పనులను నేరుగా పర్యవేక్షిస్తామన్నారు. త్వరలోనే మరిన్ని చోట్ల మంత్రులతో కలసి పనులకు శంకుస్థాపన చేస్తామని తెలిపారు.

FullSizeRender

ఇక నగరంలోని ఎంఎల్‌ఏలు మరింత చొరవ చూపి తమ నియోజక వర్గాల్లోని ఖాళీ స్థలాలను గుర్తించాలన్నారు. మురికి వాడల్లో పేదలను చైతన్యవంతం చేస్తూ అక్కడ డబుల్ బెడ్ రూం నిర్మాణం జరిగేలా చూడాలన్నారు. నగరంలో హౌసింగ్ కోసం ప్రత్యేకంగా ప్రాజెక్టు మేనేజ్ మెంట్ యూనిట్ ఏర్పాటు చేయాలని హౌసింగ్ శాఖ మంత్రి ఇంద్ర కరణ్ రెడ్డిని మంత్రి కెటి రామారావు కోరారు.

నగరంలోని ఇళ్ల నిర్మాణానికి హౌసింగ్ శాఖ పూర్తి స్ధాయిలో సహకారం అందిస్తుందన్నారు. వేంటనే జియచ్ యంసి అధికారులతో ప్రత్యేకంగా సమావేశం కావాలని ఇంద్రకరణ్ రెడ్డి హౌసింగ్ శాఖ అధికారులను అదేశించారు. నగరంలో లక్ష ఇళ్లు కట్టాలని ముఖ్యమంత్రి ఇచ్చిన అదేశాలను నేరవేర్చుతామని మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి తెలిపారు. నగరంలోపాటు ఇతర ప్రాంతాల్లోనూ హౌసింగ్ స్కీంను మరింత వేగవంతం చేస్తామన్నారు. ఈ డబుల్ బెడ్ రూంల వలన ప్రజల జీవన ప్రమాణాల్లో మార్పు తీసుకుని వస్తుందని, ఈ డబుల్ బెడ్ రూం లబ్దిదారులు వాటిని అమ్ముకోకుండా, కుటుంబానికి రక్షణ ఇచ్చేలా చూడాలని ఈ మేరకు ఈ హౌసింగ్ స్కీం పథకం మార్గదర్శకాల్లో ఈ నిబంధన చేర్చాలని మంత్రి కెటి రామారావవు కోరారు. ఈ నిబంధన లేకుంటే పేద ప్రజల జీవితాల్లో మార్పు సాద్యం కాదన్నారు. ఈ ఇళ్లలో వారు జీవించినప్పుడే వారి సామాజిక స్థాయిల్లో మార్పు వస్తుందని, ప్రభుత్వం లక్ష్యానికి సార్ధకత వస్తుందన్నారు.

- Advertisement -