రాహుల్ ని చంపేసిన డిగ్గీరాజ..!

239
Digvijaya Singh goofs-up twice, declares 'Rahul Gandhi Cabinet ...
- Advertisement -

కాంగ్రెస్‌ సీనియర్‌ నేత దిగ్విజయ్‌ సింగ్‌ మళ్ళీ పప్పులో కాలేసారు. ఈ మధ్య దిగ్విజయ్‌ సింగ్‌ కొన్ని విషయాలను మర్చిపోతున్నారు. చేసిన పొరపాట్లు కాకుండా కొత్త పొరపాట్లు కూడా చేస్తున్నారు. ఇంతకీ డిగ్గీరాజా ఏ విషయం మర్చిపోయారు అనేగా మీ డౌట్‌..?

ఇప్పుడు రాహుల్‌ గాంధీ ఎవరు?…కాంగ్రెస్‌ ఉపాధ్యక్షుడు. మరి రాజీవ్‌ గాంధీ? భారత మాజీ ప్రధాని. ఈ విషయం అందరికీ తెలిసిందే. కానీ కాంగ్రెస్‌ సీనియర్‌ నేత దిగ్విజయ్‌ సింగ్‌ మాత్రం ఈ విషయం మర్చిపోయినట్టున్నారు.
Rahul-Gandhi-tweeted-a-prayer-for-Prime-Minister-Narendra-Modi-which-asks-for-freedom-from-ignorance

ఎందుకంటే ఆయన చేసిన ట్విట్‌ చూసి నెటిజన్లు అలాగే ఫీలవుతున్నారు మరి. దివంగత నేత రాజీవ్ గాంధీ  ప్లేస్‌ లో రాహుల్‌ గాంధీని పెట్టేశారు దిగ్వజయ్‌. అందుకే రాజీవ్‌ గాంధీని..రాహుల్‌ గాంధీలా మార్చి మళ్ళీ పప్పులో కాలేశారు. ఫలానా వ్యక్తి ‘రాహుల్‌ కేబినెట్‌’లో పనిచేశారంటూ ట్వీట్‌ చేశారు.

నిజానికి ఏం జరిగిందంటే..కాంగ్రెస్‌ మాజీ ఎంపీ రాజ్‌కుమారి రత్నసింగ్‌ తీసిన ఓ వీడియోను దిగ్విజయ్‌ ట్విట్టర్లో పోస్టు చేశారు. అంతేకాకుండా.. రత్నసింగ్‌ ఎవరో పరిచయం చేస్తూ.. దిగ్విజయ్‌ తడబడ్డారు. ‘రత్నసింగ్‌ రాజా దినేశ్‌ సింగ్‌ కుమార్తె. ఇందిరాగాంధీ, రాహుల్‌గాంధీ కేబినెట్‌లో దినేశ్‌ మంత్రిగా పనిచేశారు’ అంటూ దిగ్విజయ్‌ ట్వీట్‌ చేశారు.

అయితే రాజీవ్‌కు బదులుగా రాహుల్‌ అని రాయడంతో నెటిజన్లు ఆయనపై తెగ కామెంట్లు చేసేస్తున్నారు. రాహుల్‌ ఎవరో డిగ్గీరాజా మర్చిపోయినట్లున్నారు, మాజీ ప్రధాని అని.. రాహుల్‌ని దిగ్వజయ్ చంపేశారంటూ ఆయనపై వ్యంగ్యాస్త్రాలు సంధిస్తున్నారు నెటిజన్లు. ఇది తెలుసుకున్న డిగ్గీరాజా.. వెంటనే తేరుకొని.. రాజీవ్‌గాంధీ కేబినెట్‌ అని సరిచేసి మళ్లీ ట్వీట్‌ చేశారు.
Digvijaya Singh goofs-up twice, declares 'Rahul Gandhi Cabinet ...
దిగ్విజయ్‌ ఇలాంటి పొరపాట్లు చేయడం ఇది తొలిసారి కాదు. గతేడాది కశ్మీర్‌లో జరిగిన అల్లర్లను ప్రస్తావిస్తున్న సమయంలోనూ పాక్‌ ఆక్రమిత కశ్మీర్‌కు బదులుగా ‘భారత ఆక్రమిత కశ్మీర్‌’ అంటూ వ్యాఖ్యానించారు. దీంతో అప్పుడు కూడా సోషల్‌ మీడియాలో హాట్‌ టాపిక్‌ గా మారిపోయారు దిగ్విజయ్‌ సింగ్‌.

అందుకే అంటారేమో…ఇలా 50,60సంవత్సరాలు నిండిన వయసుగలవారు తమ పదవులను వారి వారసులకు కట్టబెట్టడమో, లేక తట్టాబుట్టా సర్థుకొని వెళ్ళడమో బెటర్‌ అని. ఎందుకంటే ఇలాంటి మతిమరుపు వ్యవహారాలతో ఇతరులను కన్‌ఫ్యూజ్‌ చెయ్యకుండా ఉండడానికి.

Digvijaya Singh goofs-up twice, declares 'Rahul Gandhi Cabinet ...

Digvijaya Singh goofs-up twice, declares 'Rahul Gandhi Cabinet ...

- Advertisement -