రాష్ర్టంలోని కార్పోరేషన్లు, మునిసిపల్ కమీషనర్లతో పురపాలక శాఖ మంత్రి కెటి రామారావు ఈ రోజు సమావేశం నిర్వహించారు. సిడియంఏ కార్యాలయంలో జరిగిన ఈ సమావేశంలో మంత్రి పురపాలనపైన మార్గనిర్ధేశనం చేశారు. ప్రతి కమీషనర్ కు తమ పట్టణాల పట్ల పూర్తి అవగాహణ ఉండాలని, పట్టణ వనరులు, అవసరాలు, ప్రణాళిలకలపైన పట్టు ఉన్నప్పుడే అవి మారతాయని తెలిపారు. ఒక్క మున్సిపల్ కమీషర్ చురుగ్గా పనిచేస్తే పట్టణ రూపురేఖలు మారతాయన్నారు.
డిసెంబర్ నెలలో అన్ని పట్టణాలను ఓడియప్( బహిరంగ మల మూత్ర విసర్జన రహిత పట్టణాలుగా) ప్రకటించేందుకు సిద్దంగా ఉండాలని, దాన్ని పూర్తి చేయాలని అదేశాలిచ్చామన్న మంత్రి, కొన్ని పట్టణాలు ఈ విషయంలో వెనకబడడం పట్ల మంత్రి అసహానం వ్యక్తం చేశారు. ప్రతి ఇంటికి ఒక మరుగుదొడ్డి ఉండాలని, ఈ లక్ష్యాన్ని జూన్ 15 నాటికి ఖచ్చితంగా పూర్తి చేయాలని మంత్రి అదేశాలు జారీ చేశారు. ఈ మేరకు తనకు ప్రతి రోజు స్టేటస్ అప్డేడ్ చేయాలన్నారు. దీంతోపాటు లక్ష్యం పూర్తి చేయని పట్టణాల్లోని అధికారులు లక్ష్యం పూర్తి చేసిన మున్సిపాలీటీల అధికారుల సహకారంతో పనిచేయాలని, అవసరం అయితే నేరుగా సిడియంఏ నుంచి అధికారి ఒకరిని ప్రత్యేకంగా అయా పట్టణాలకు పంపాలని సిడియంఎ శ్రీదేవి అదేశాలు జారీ చేశారు. లక్ష్యం మేరకు బహిరంగ మల మూత్ర విసర్జన రహిత పట్టణాలుగా మార్చిన పలువురు కమీషనర్లను మంత్రి అభినందించారు. పనుల్లో వెనక బడిన వారు ఇలాంటి వారి స్పూర్తితో పనిచేయండని కోరారు.
ప్రతి పట్టణంలో డంప్ యార్డులను అబివృద్ది చేయాలని మంత్రి కెటి రామారావు కమీషనర్లను కోరారు. ఈ వర్ష కాలంలో హరితహారం కార్యక్రమంలో భాగంగా మెడిసినల్, సువాసనలు వెదజల్లే మెక్కలను డంప్ యార్డులో నాటాలన్నారు. పట్టణాల్లో పారిశుద్ధ్య ప్రణాళిక రూపోందించి కావాల్సిన అవసరాలను సిడియంఏ కార్యాలయానికి ప్రపోజ్ చెయ్యాలని వీటికి అవసరం అయిన నిధులు ఇస్తామని తెలిపారు. ప్రతి పారిశుద్ద్య కార్మికుడికి ఖచ్చితంగా రేడియం జాకెట్లు, బూట్లు, గ్లౌసుల వంటి రక్షణ పరికరాలు విధిగా ఇవ్వాలని అదేశాలు జారీ చేశారు. మంత్రి అదేశాల మేరకు కమీషనర్లు హైదరాబాద్ నగరంలోని అదర్శ శ్మశాన వాటికలు( మహా ప్రస్థానం), ఇతర ప్రదేశాలను సందర్శించారు. వీటిని స్పూర్తిగా తీసుకుని పట్టణాల్లోనూ అభివృద్ది కార్యక్రమాలను చేపట్టాలని మంత్రి కోరారు.
పట్టణాల్లోని వీధీ దీపాలకు ఏల్ ఈ డీ లైట్ల భిగింపుపైన మంత్రి ఆరా తీసారు. ప్రతి పట్టణంలోని మున్సిపల్ కార్యాలయాల్లో ఎల్ ఈ డీ లైట్ల కౌంటర్లను ఈ నెలఖరు లోపల ఏర్పాటు చేయాలి. ఇక్కడ నుండి పౌరులు వాటిని కోనుగోలు చేసేలా చూడాలన్నారు. ప్రతి పట్టణ మునిసిపల్ కార్యాలయంలో ఒక సిటిజన్ సర్వీస్ సెంటర్ ఏర్పాటు చేయాలని ఈ మేరకు ప్రతిపాధనలు పంపాలని కోరారు. పట్టణాల్లో ఎల్ అర్ యస్ ప్రక్రియ మరింత వేగంవంతం చేయాలన్నారు. పట్టణాల్లోని పారిశుద్యం, అదాయ రాబడి, స్థూలంగా పట్టణాల మున్సిపాలీటీల పనితీరు మొరుగు పర్చేందుకు 8 మందితో ఒక కమీటీ ఎర్పాటు చేస్తున్నట్లు మంత్రి తెలిపారు. ఈ కమీటీ నెల రోజుల్లో నివేధిక ఇస్తుందని మంత్రి తెలిపారు.ఈ సమావేశంలో మంత్రితోపాటు పురపాలక కార్యదర్శి జయేష్ రంజన్, సిడియంఏ శ్రీదేవి ఇతర అధికారులు పాల్గోన్నారు.