చిన్నారి చికిత్సకు కేటీఆర్‌ సాయం..

309
KTR
- Advertisement -

సోషల్‌ మీడియాలో టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఎంత చురుగా ఉంటారో మనకు తెలిసిందే. అపదలో ఉన్నట్లు ఎవరైనా కేటీఆర్‌ దృష్టి తీసుకొచ్చిన లేక ఆయనే స్వయంగా తెలుసుకున్నా.. కేటీఆర్‌ వెంటనే స్పందించి భాదితులకు సహాయసహాకారాలు అందిస్తారు. గతంలో ఎంతో మంది చిన్నారులకు,వృద్దులకు,వికలాంగులకు.. అపదలో ఉన్నవారికి ఆపద్బాంధవుడిలా ఆర్థికసాయం చేశారు మన రామన్న.

KTR

ఇక తాజాగా మారోసారి కేటీఆర్‌ ఆయన మంచి మనసును చాటుకున్నారు. అసలు విషయానికొస్తే.. ఓ టీవీ చానెల్‌లో పనిచేసే నరేశ్ ఠాకూర్ అనే వ్యక్తి కుటుంబంతో కలిసి ఆల్వాల్‌లో ఉంటున్నాడు. అతని కుమారుడు కృషీవ్ ఠాకూర్ గత నెల 31వ తేదీన ఆడుకుంటూ వేడినీళ్లు పైనపోసుకున్నాడు. దాంతో తీవ్రగాయాలయ్యాయి. అప్పటినుంచి అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. తమ వద్ద ఉన్న డబ్బు అయిపోవడంతో నరేశ్ ఠాకూర్ దాతలను సాయం అడిగాడు. ఇది చూసిన హీరో మంచు మనోజ్‌ చలించిపోయాడు.

వెంటనే ఆయన ఆర్థిక సాయం అందించాడు. అంతేకాదు ఈ విషయాన్ని కేటీఆర్‌కు ట్వీట్ చేశారు. తాను సాయం చేశానని, కానీ, మరికొందరు కూడా సాయం చేస్తే ఆ బాలుడి చికిత్సకయ్యే ఖర్చుల భారం తగ్గుతుందని మంచు మనోజ్ ట్విట్టర్‌ ద్వారా విజ్ఞప్తి చేశారు. హీరో మంచు మనోజ్ చేసిన ట్వీట్‌కు వెంటనే స్పందించారు కేటీఆర్‌. విషయం తెలుసుకొని ముఖ్యమంత్రి సహాయనిధి నుంచి రూ.2 లక్షల రూపాయలు మంజూరుచేస్తున్నట్టు ట్వీట్ చేశారు. ఈ మేరకు ఉత్తర్వుల ప్రతిని కూడా తన ట్వీట్‌లో పొందుపరిచారు.

- Advertisement -