KTR:రైతుల బాధ కనిపించడంలేదా?

20
- Advertisement -

కాంగ్రెస్ అసమర్థ పాలనలో సాగునీరు లేక అన్నదాతలు పంట నష్టపోతున్నారని చెప్పారు మాజీ మంత్రి కేటీఆర్. ఆరు గ్యారెంటీల పేరిట గారడి చేసిన రాహుల్ గాంధీ.. పార్లమెంట్‌ ఎలక్షన్లలో న్యాయ్‌ పేరిట నయా నాటకానికి తెరతీశారా అని ప్రశ్నించారు. కాంగ్రెస్ జనజాతర సభ కాదని, హామీల పాతర.. అబద్ధాల జాతర సభ అంటూ ఫైర్‌ అయ్యారు.

నమ్మి ఓటేసిన నాలుగుకోట్ల తెలంగాణ ప్రజలను కాంగ్రెస్‌ పార్టీ నాలుగు నెలలుగా నయవంచన చేసిందని మండిపడ్డారు. గ్యారెంటీలకు పాతరేసి, అసత్యాలతో జాతర చేస్తుందని.. రుణమాఫీ లేక రైతులు అప్పుల పాలవుతున్నారని, తాగునీటికి తెలంగాణ ప్రజలు తండ్లాడుతున్నారని చెప్పారు.

75 ఏళ్ల స్వతంత్ర భారత చరిత్రలో దేశంలో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలు, ఇంకా వెనకబడి ఉన్నారంటే కారణమే కాంగ్రెస్ పార్టీ అని ఆరోపించారు. కులగణన పేరిట మీ కొత్త పల్లవికి ఓట్లు రాలవని, చేతి గుర్తుకు ఓటేస్తే చేతులెత్తేయడం ఖాయమని తెలంగాణ సమాజానికి అర్థమైపోయిందన్నారు.

- Advertisement -