అవిశ్వాస తీర్మానం సందర్భంగా బీజేపీ ఎంపీ బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలపై తెలంగాణ సమాజం భగ్గుమంటోంది. సీఎం కేసీఆర్‌పై లోక్ సభలో అనుచిత వ్యాఖ్యలు చేశారు. దీనిపై ట్విట్టర్ వేదికగా ప్రశ్నల వర్షం కురిపించారు కేటీఆర్.
Also Read:బండి సంజయ్ రాజీనామాకు సిద్దమా?
ప్రధాని మోడీని అవమానించారన్న కారణంతో కాంగ్రెస్ ఎంపీపై చర్యలు తీసుకున్నారని.. మరి ఇప్పుడు సీఎం కేసీఆర్‌పై అత్యంత నీచమైన భాషలో మాట్లాడిన బీజేపీ ఎంపీని ఏం చేయాలో స్పీకర్ చెప్పాలని డిమాండ్ చేశారు. ప్రధాని ఇంటిపేరును అవమానకరంగా పిలిచినందుకు కాంగ్రెస్ ఎంపీ సభ్యత్వాన్ని రద్దు చేశారు. ఇప్పుడు తెలంగాణకు చెందిన ఒక బీజేపీ ఎంపీ లోక్ సభలో తెలంగాణ రాష్ట్రానికి రెండు సార్లు ఎన్నికైన పాపులర్ సీఎంను అత్యంత నీచమైన భాషలో దూషించారు. దీనిపై ఏం చేస్తారని స్పీకర్ ఓం బిర్లాను ప్రశ్నించారు.
So an MP of Congress was disqualified from his membership for calling out PM’s surname in a derogatory way
Now a BJP MP from Telangana goes to great lengths and denigrates Telangana’s twice elected popular CM KCR in the filthiest language in Loksabha yesterday
What should…
— KTR (@KTRBRS) August 11, 2023