సింగరేణి…సిరుల గని:కేటీఆర్‌

286

సీఎం కేసీఆర్ నాయకత్వంలో సింగరేణి సిరుల గనికిగా అభివృద్ధి పథంలో దూసుకుపోతోంది. గడిచిన ఐదేళ్ల కాలంలో రాష్ట్రంలోనే కాదు దేశంలోనే ప్రముఖ ప్రభుత్వ రంగ సంస్థలకు దీటుగా నిలిచింది. ప్రధానంగా అమ్మకాలు, లాభాల్లో  సింగరేణి చరిత్రలోనే అత్యధిక వృద్ధి రేటును నమోదు చేసింది.

ఈ నేపథ్యంలో సింగరేణి సీఎండీ,ఉద్యోగులకు అభినందనలు తెలిపారు టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. సీఎం కేసీఆర్ నాయకత్వంలో గడిచిన 5 సంవత్సరాలలో సింగరేణి సంస్థ గణనీయమైన వృద్ధి చెందిందని ట్విట్టర్‌ ద్వారా ట్వీట్ చేశారు.అమ్మకాలలో 11 వేల 928 కోట్ల నుండి 25 వేల 828 కోట్ల వృద్ధి ,117 శాతం వృద్ధి నమోదు ప్రాఫిట్ గ్రోత్ 419 కోట్ల నుండి1600 కోట్ల రూపాయల వృద్ధి అంటే 282 శాతం లాభాలు గడిచిందన్నారు.

గత ఐదేళ్లలో అమ్మకాలు, లాభాలు గణనీయంగా పెరిగాయని సింగరేణి సంస్థ నివేదికలో ప్రకటించింది. సంస్థ అమ్మకాలు 116.5 శాతం, లాభాలు 282 శాతం పెరిగాయని, సంస్థ చరిత్రలో ఇంత భారీ వృద్ధి రేటునమోదవడం ఆల్‌టైం రికార్డుగా అభివర్ణించింది. అమ్మకాల్లో కోల్‌ ఇండియా 55.1 శాతం వృద్ధి సాధించగా, సింగరేణి 116.5 శాతంతో ముందున్నట్లు తెలిపింది. సంస్థ అమ్మకాలు 2013-14లో రూ.11,928 కోట్లుంటే 2018-19 నాటికి రూ.25,828 కోట్లకు పెరిగాయి. 2025 నాటికి 10 కోట్ల టన్నుల బొగ్గు ఉత్పత్తి లక్ష్యం దాటేలా పనులు చేస్తున్నట్లు తెలిపారు సింగరేణి సీఎండీ శ్రీధర్.

cm kcr