బిగ్ బాస్ 3లో శ్రీముఖి..పటాస్ కొత్త యాంకర్ ఎవరో తెలుసా?

648
Srimukhi Bigboss

బుల్లితెరపై ప్రసారమయ్యే పటాస్ కామెడీ షోతో బాగా పాపులర్ అయ్యింది యాంకర్ శ్రీముఖి. తన అందం, మాటలు, నటనతో పటాస్ షోకు మరింత గ్లామర్ తీసుకువచ్చింది . అప్పుడప్పుడు పలు సినిమాల్లో నటిస్తూ యాక్టర్ గా కూడా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. శ్రీముఖ చాలా టీవీ షోలు చేసినప్పటికి పటాస్ ద్వారా ఆమెకు మంచి బ్రేక్ వచ్చిందని చెప్పుకోవాలి. ఇన్ని రోజుల నుంచి పటాస్ సక్సెస్ గా నడవడానికి కారణం శ్రీముఖి అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. కేవలం శ్రీముఖి కోసమే కొంత మంది పటాస్ షో చూస్తారనడంలో అతిశయోక్తి లేదు.

Patas Anchor Srimukhi

పటాస్ షో నుంచి తాను కొద్ది రోజులు బ్రేక్ తీసుకుంటున్నట్లు ఓ వీడియో ద్వారా తెలిపింది శ్రీముఖి. ఇందుకు మల్లెమాల యాజమాన్యం కూడా ఒప్పుకుందని చెప్పింది. అప్పటి నుంచి శ్రీముఖి పటాస్ నుంచి ఎందుకు బ్రేక్ తీసుకుందని ఆలోచిస్తున్నారు ప్రేక్షకులు. తాజాగా శ్రీముఖికి సంబంధిచిన ఓవార్త సోషల్ మీడియాలో వైరల్ గామారింది. శ్రీముఖికి బిగ్ బాస్ సీజన్ 3లో పార్టిసిపెంట్ గా వెళ్తుందని అందుకే కొద్ది రోజులు పటస్ షో కు బ్రేక్ ఇవ్వనున్నట్లు తెలుస్తుంది. ఈవిషయాన్ని శ్రీముఖి తన సన్నాహితులతో చెప్పిందని తెలుస్తుంది.

Vishnu Varshini

ఈ షో, జూలై రెండవ వారంలో ప్రారంభం కానుందని సమాచారం. ఇక శ్రీముఖి లేకపోవడంతో పటాస్ కు కొత్త యాంకర్గా విష్ణుప్రియ లేదా వర్షిణిని తీసుకొనున్నట్లు సమాచారం. విష్ణుప్రియ ఇప్పటికే సుధీర్ తో పోవే పోరా షో చేస్తున్న సంగతి తెలిసిందే. శ్రీముఖి ప్లేస్ లో ఎవరిని తీసుకుంటారో తెలియాలంటే మరి కొద్ది రోజులు వేచి చూడాల్సిందే. . ఏదిఏమైనా పటాస్ లో శ్రీముఖిని మిస్ అయినా బిగ్ బాస్ లో చూడవచ్చు అన్నమాట.