జగన్ ఫస్ట్ టార్గెట్ వీళ్లే…!

216
jagan ys

మరో ఆరురోజుల్లో ఎన్నికల ఫలితాలు వెలువడనున్నాయి. ఏపీలో గెలుపుపై టీడీపీ,వైసీపీ ఎవరి ధీమాను వారు వ్యక్తం చేస్తున్నారు. అయితే వైసీపీ మాత్రం ఏపీకి కాబోయే సీఎం జగనే ప్రచారాన్ని విస్తృతంగా చేస్తోంది. మంత్రిపదవుల దగ్గరి నుండి నామినెటేడ్ పోస్టుల వరకు ఇప్పటికే నేతలు పైరవీ కూడా మొదలుపెట్టారు.

జగన్ అధికారంలోకి రాగానే ఇక ఫస్ట్ టార్గెట్ చేసేది వీరినేనని ప్రచారం సాగుతోంది. తొమ్మిది సంవత్సరాలుగా జగన్‌ను టార్గెట్ చేస్తూ వస్తున్న ఎల్లో మీడియా సంగతి చూడనున్నారట జగన్‌. సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన కొద్దిగంటల్లోనే తనపై విషపు కథనాలను ప్రచురిస్తూ వచ్చిన పత్రికలు,మీడియాను టార్గెట్ చేస్తారని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు.

జ‌గ‌న్ సైతం త‌న ప్ర‌చారంలో తనకు వ్యతిరేకంగా వార్తలు రాస్తున్న పత్రికలతో పాటు ఓ టీవీ ఛానల్‌పై యుద్ధం చేయాల‌ని చెప్పారు. అయితే ఎన్నికల ప్రచారంలో జగన్‌ అలా చెప్పినా కావాలని ఆయన ఎవరిని టార్గెట్ చేసేందుకు ఇష్టపడరని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు. ఏదేమైనా ప‌దేళ్ల‌పాటు ప్ర‌తిప‌క్షంలో ప్రభుత్వంతో పాటు ఎల్లోమీడియాతో యుద్ధం చేసిన జగన్..ఒకవేళ ప్రభుత్వాన్ని ఏర్పాటుచేస్తే మరో కొత్త యుద్దం చేయాల్సిన పరిస్థితి నెలకొంది.