‘మాయి ముంత’ కథా సంపుటి..అద్భుతం!

1
- Advertisement -

తెలంగాణ జనజీవన పోరాటాలు, సామాన్య ప్రజల భావోద్వేగాలను తన రచనల్లో ప్రతిబింబించే ప్రముఖ రచయిత పెద్దింటి అశోక్ కుమార్‌పై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రశంసలు కురిపించారు. ఇటీవల అశోక్ కుమార్ రచించిన ‘మాయి ముంత’ కథా సంపుటిని చదివిన కేటీఆర్, ఆ కథలు తన మనసును లోతుగా తాకాయని సోషల్ మీడియాలో తెలిపారు.

ప్రత్యేకంగా ‘మాయి ముంత’, ‘సావు దప్పు’, ‘జిద్దు’ వంటి కథలు తనను తీవ్రంగా ఆలోచింపజేశాయని, ఇవి కేవలం కథలు కాకుండా తెలంగాణ ప్రజల జీవన వాస్తవాలకు అద్దం పట్టే రచనలు అని అభిప్రాయపడ్డారు. మన సమాజంలోని బాధలు, ఆశలు, పోరాటాలను ఎంతో సహజంగా, హృద్యంగా వ్యక్తీకరించిన తీరు అభినందనీయమని పేర్కొన్నారు.

భారతీయ సాహిత్యంలో చిరస్థాయిగా నిలిచే సామర్థ్యం ఈ కథలకు ఉందని కేటీఆర్ అభిప్రాయపడ్డారు. మట్టి వాసనను, స్థానిక సంస్కృతిని, మనుషుల భావజాలాన్ని అద్భుతంగా ప్రతిబింబించే రచయితగా అశోక్ కుమార్‌ను కొనియాడారు.

ఇలాంటి విలువైన రచనలు మరింతగా వెలువడాలని, తెలంగాణ సంస్కృతి మరింత విస్తృతంగా ప్రపంచానికి పరిచయం కావాలని ఆయన ఆకాంక్షించారు. ప్రస్తుతం కేటీఆర్ చేసిన ఈ ప్రశంసల పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారి, సాహిత్య ప్రియుల్లో చర్చనీయాంశంగా నిలిచింది.

Also Read:హైకోర్టులో కాంగ్రెస్ ప్రభుత్వానికి ఎదురుదెబ్బ

- Advertisement -