నిజామాబాద్ జిల్లా ఆలూర్ మండల కేంద్రంలోని జడ్పీ ఉన్నత పాఠశాలలో పరీక్ష ప్రారంభమైన కొద్దిసేపటికే వాట్సప్ గ్రూపుల్లో చక్కర్లు కొట్టింది హిందీ పేపర్.హిందీ పేపర్ ఫోటో తీసి వాట్సాప్ గ్రూపుల్లో పంపి జవాబులు తెప్పించారు క్లర్క్ ఉపేందర్, ఇన్విజిలేటర్ నిజాంపూర్ సాగర్.
బోధన్, మెండోరా మండలాల వాట్సాప్ గ్రూపుల్లో హిందీ పేపర్ చక్కర్లు కొట్టడంతో విచారణ చేపట్టారు డీఈవో. ప్రశ్నపత్రం లీక్‌పై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు.
కలెక్టర్ ఆదేశాలతో రాజేందర్ (జీహెచ్ఎం, దేగాం), విజయ్ కుమార్ (స్కూల్ అసిస్టెంట్, మచ్చెర్ల), ఉమేందర్ (ఎస్జీటీ, మిర్దాపల్లి), సాగర్ (ఎస్జీటీ, డీకంపల్లి), మమత (జీహెచ్ఎం, ఎస్సారెస్పీ), రవీందర్ (స్కూల్ అసిస్టెంట్, వెల్గటూర్), భూపతి (స్కూల్ అసిస్టెంట్, ఎస్సారెస్పీ), వేణు (స్కూల్ అసిస్టెంట్, పెంటాకలాన్, బోధన్), శివానందరావు (స్కూల్ అసిస్టెంట్, కల్దుర్కి, బోధన్)లను సస్పెండ్ చేశారు డీఈవో.
Also Read:హైకోర్టులో కాంగ్రెస్ ప్రభుత్వానికి ఎదురుదెబ్బ

