మహిళా కానిస్టేబుల్‌కు కేటీఆర్ అభినందనలు

261
ktr
- Advertisement -

కరోనా వైరస్ కట్టడికి తెలంగాణ ప్రభుత్వం పటిష్టమైన చర్యలు తీసుకుంటోంది. ఇందులో భాగంగా లాక్ డౌన్‌ను పకడ్బందిగా అమలు చేస్తోంది. అయితే లాక్ డౌన్‌ నేపథ్యంలో మానవత్వంతో స్పందించిన మహిళా కానిస్టేబుల్‌ యశోదను కేటీఆర్ అభినందించారు. అపన్నులను ఆదుకోవడానికి 100 కిలోల బియ్యం విరాళంగా ఇవ్వడం అభినందనీయమని ట్విట్టర్‌ ద్వారా తెలిపారు.

కరోనా వైరస్ ను నియంత్రించేందుకు తెలంగాణ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది. ఈ నేపథ్యంలో ఏపీకి చెందిన శివయ్య అనే వ్యక్తి తాము హైదరాబాద్‌లో తాము సురక్షితంగా ఉన్నామని తెలుపుతూ కేటీఆర్‌కు ట్వీట్ చేశాడు.

తాను ఆంధ్రప్రదేశ్‌వాసిని. హైదరాబాద్‌లో పనిచేస్తున్న. కరోనా కట్టడిలో భాగంగా మొదట్లో నన్ను ఏపీకి వెళ్లకుండా అడ్డుకోవడం ఇబ్బందిగా అనిపించింది. తర్వాత తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న చర్యలు, శ్రద్ధ నన్ను ఎంతగానో అనందపరిచిందని…సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్‌లకు కృతజ్ఞతలు తెలిపారు.

- Advertisement -